వింతల్లో వింత: అక్కడ దేవుడికి తల వెంట్రుకలు ఇస్తే చాలు.. ఇక జుట్టు రాలే సమస్యే ఉండదట!

వింతల్లో వింత: అక్కడ దేవుడికి తల వెంట్రుకలు ఇస్తే చాలు.. ఇక జుట్టు రాలే సమస్యే ఉండదట!
x
Highlights

Mikami Shrine Japan: మీకు జుట్టు రాలిపోతోందా? బట్టతల వస్తుందని భయపడుతున్నారా? అయితే మీరు జపాన్‌లోని ఈ 'మికామి ష్రైన్' (Mikami Shrine) ను దర్శించుకోవాల్సిందే.

Mikami Shrine Japan: మీకు జుట్టు రాలిపోతోందా? బట్టతల వస్తుందని భయపడుతున్నారా? అయితే మీరు జపాన్‌లోని ఈ 'మికామి ష్రైన్' (Mikami Shrine) ను దర్శించుకోవాల్సిందే. జపాన్‌లోని క్యోటో నగరం సమీపంలో ఉన్న అరాషియామా బాంబూ ఫారెస్ట్ మధ్యలో ఈ వింత ఆలయం ఉంది. ప్రపంచంలో జుట్టు కోసం వెలిసిన ఏకైక ఆధ్యాత్మిక క్షేత్రంగా దీనికి గుర్తింపు ఉంది.

జుట్టుతో వింత పూజలు!

ఈ ఆలయంలో చేసే ప్రార్థనలు చాలా వెరైటీగా ఉంటాయి. భక్తులు ఇక్కడికి రాగానే పూజారులు వారి తల నుంచి కొన్ని వెంట్రుకలను కత్తిరిస్తారు. ఆ వెంట్రుకలను ఒక ఎన్వలప్ కవర్‌లో పెట్టి భక్తులకు ఇస్తారు. భక్తులు ఆ కవర్‌ను దేవుడి ముందు ఉంచి, తమ జుట్టు రాలకూడదని, కురులు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తారు. అనంతరం దాన్ని తిరిగి పూజారులకు అప్పగిస్తారు. ఇలా చేస్తే జుట్టు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం.

ఎవరీ హెయిర్ గాడ్?

ఈ ఆలయంలో కొలువైన దైవం ఎవరో కాదు.. జపాన్ చరిత్రలో మొట్టమొదటి హెయిర్ డ్రెస్సర్‌గా గుర్తింపు పొందిన ఫుజివారా ఉనెమనోసుకే మసయుకి. కుమాకురా కాలానికి చెందిన మసయుకి, జపాన్‌లో హెయిర్ స్టైలింగ్‌ను ఒక గౌరవప్రదమైన వృత్తిగా మార్చారు. ఆయన ప్రతిభను గుర్తించి, ఆయన జ్ఞాపకార్థం శతాబ్దాల క్రితమే ఈ మికామి ఆలయాన్ని నిర్మించారు.

ఎవరు సందర్శిస్తారు?

కేవలం జుట్టు సమస్యలు ఉన్నవారే కాకుండా, ఈ ఆలయానికి వివిధ వర్గాల వారు వస్తుంటారు:

బ్యూటీషియన్లు: నేషనల్ బ్యూటీషియన్ పరీక్షలు రాసే విద్యార్థులు తమకు మంచి ర్యాంకు రావాలని ఇక్కడ మొక్కుకుంటారు.

స్టైలిస్టులు: సెలూన్ యజమానులు తమ వ్యాపారం బాగుండాలని షాపులు మూసివేసి మరీ ఇక్కడికి వస్తుంటారు.

పర్యాటకులు: ట్రావెల్ వ్లాగర్ షెర్విన్ ఈ ఆలయాన్ని సందర్శించిన వీడియో వైరల్ కావడంతో, ఇప్పుడు విదేశీ పర్యాటకులు కూడా మికామి ష్రైన్‌కు క్యూ కడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories