Marriage: ఆలస్యం వద్దు.. మంచి ముహూర్తాలు ఇవే.. లేదంటే నాలుగు నెలలు ఆగాల్సిందే..?

Marriage Dates in August 2022 Hindu Calendar
x

Marriage: ఆలస్యం వద్దు.. మంచి ముహూర్తాలు ఇవే.. లేదంటే నాలుగు నెలలు ఆగాల్సిందే..?

Highlights

Marriage: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట సందడి వాతావరణం నెలకొంటుంది.

Marriage: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట సందడి వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా వరుస పండుగలతో హడావుడి ఉంటుంది. ఓవైపు పూజలు వ్రతాలు నోములు అంటూ నిత్యం బిజీ బిజీగా గడుపుతారు. కాగా ఇదే సమయం ఆగస్టు నెలల్లో పెళ్లిల సందడి ఈ సారి ఎక్కువగా ఉంది. ఉన్నఈ కొద్ది ముహూర్తాలు మిస్ అయితే మరో నాలుగు నెలలు ఆగాల్సి వస్తుండడంతో పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లి సందడే కనిపిస్తోంది. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో ముహూర్తాలు ముంచుకొచ్చాయి. ఎక్కడ చూసినా పెళ్ళి ముహుర్తాలతో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు కిటకిటలాడిపోతున్నాయి. ఈ ముహూర్తాలు కొద్ది రోజులే ఉండడంతో వాటికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది 2022లో శ్రావణ మాసంలో ఆగస్టు నెల 21 వరకే పెళ్లికి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నవ జంటలు ఒక్కటవుతున్నారు.

ఆగస్టు ఒకటో తారీకు నుంచి మూడోవారం వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ముహుర్తాలు పెట్టుకున్న వారి ఇళ్లల్లో పెళ్లి సందడి భారీగా కనిపిస్తోంది. ఆగస్టు 1, 3, 4, 5, 6, 7, 8, 10, 11, 12, 13, 16, 17, 20, 21 తేదీల్లో అధిక ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెపుతున్నారు. ఆగస్టులో ముహూర్తం కుదరకపోతే ఆ తర్వాత 4 నెలల పాటు ఎదురు చూడాల్సి ఉండటంతో ఆగస్టులోనే పిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.

ఎన్ని ముహూర్తాలు ఉన్నా అందులో కొన్ని చాలా బలమైన ముహూర్తాలు ఉంటాయి. ఈ మాసంలో ముహూర్తాలు ఉన్న సమయంలో తారా బలాలు బాగుండటంతో ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. దీనికి తోడు మళ్లీ నాలుగు నెలల పాటు ముహూర్తాలు లేకపోవడంతో ఈ డిమాండ్ పెరిగింది.

గతంలో అయితే శ్రావణ మాసంలో ముహుర్తం కుదరకపోతే మిగిలినవారంతా కార్తిక మాసంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేవారు. ఎందుకంటే జులై, ఆగస్టు నెలల్లో కురిసే వానలకు భయపడి అక్టోబరు, నవంబరు నెలల్లో వచ్చే కార్తికంలోని ముహూర్తాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. కాబట్టి ఆగస్టు నెలలో పండుగలు ఉన్నాపెళ్లి ముహూర్తాలు తక్కువగానే ఉండేవి. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాబోయే నాలుగు నెలలు గురు, శుక్ర మూఢాలు రావడంతో ముహూర్తాలు లేవని జ్యోతిష్య పండితులు పురోహితులు చెబుతుండడంతో ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కు డిమాండ్ పెరిగింది.

ఇక శ్రావణ మాసంలో పెళ్లి ముహూర్తాలు పెట్టుకోకపోతే, డిసెంబరులో వచ్చే మార్గశిరం వరకు ఆగాల్సి ఉంటుందని పండితులు చెబుతుండటంతో శ్రావణంలో ఎక్కువ మంది తాళి కట్టేందుకు సిధ్ధమవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories