Man gets marry with doll: ఆ బాడీ బిల్డర్ పెళ్లి..శృంగారం అన్నీ బొమ్మతోనే!

A man married with doll
x

బొమ్మను పెళ్లి చేసుకున్న వ్యక్తి (ఇంస్తాగ్రాం ఫోటో)

Highlights

Man gets marry with doll: బొమ్మతో ప్రేమలో పడి ఆ బొమ్మనే పెళ్లి చేసుకుని ‘నా లైఫ్ నా ఇష్టం.. నేను ఎవరినీ పట్టించుకోను

Man Gets Marry With a dollడాల్: ఎవడి పిచ్చి వాడికానందం. ఒక్కోసారి ఆ పిచ్చి కూడా వెర్రి తలలు వేస్తుంది. ఆ పిచ్చ చేష్టలకు నవ్వాలో..ఏడవాలో.. జాలి పడాలో అర్ధం కాదు. అందులోనూ పాశాత్య దేశాలకు చెందిన వారు చేసే చేష్టలు చూస్తే అబ్బా ఇలా కూడా మనుషులు ఉంటారా అనిపిస్తుంది. అటువంటి స్పెషల్ కథనమే ఇది.

ఇప్పటి వరకు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం లేదా సెక్సు లో పాల్గొనడం అనేది మగా, ఆడా మధ్య లేదా స్వలింగ సపర్కుల మధ్య జరిగే కార్యక్రమం.. కానీ ఇక్కడ మాత్రం ఒక బొమ్మతో ప్రేమలో పడి సెక్సు సుఖాన్ని కూడా అనుభవించాడట ఓ వ్యక్తి. అంతే కాదండోయ్ ఆ బొమ్మనే పెళ్లి చేసుకుని 'నా లైఫ్ నా ఇష్టం.. నేను ఎవరినీ పట్టించుకోను' అని అంటున్నారు. ఈ అరుదైన రకానికి చెందిన వ్యక్తిపేరు టయూరి టోలోచ్కో. వయసు 36 సంవత్సరాలు. కజక్ నివాసి. బాడీ బిల్డర్ కూడా. ఎవ్వరు ఏమైనా అనుకోని.. నా జీవితం నాదే అంటూ బొమ్మతో ఎంజాయ్ చేస్తున్నాడు టోలోచ్కో.

ఇతనికి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. ఏడేళ్లు ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే.. ఆ తర్వాతే వచ్చింది చిక్కు. తనకు పిల్లలు కావాలని అడిగేదట గర్ల్ ఫ్రెండ్. ఇతనికేమో పిల్లలంటే ఇష్టం ఉండదట. దీంతో.. విడిపోయారు. ఆ తర్వాత మగాళ్లతోనూ డేటింగ్ చేశాడట. చివరగా సెక్స్ డాల్ తో ఫిక్స్ అయిపోయాడు టోలోచ్కో. దాదాపు ఏడాది కాలం ఆ బొమ్మతో సెక్స్ చేసి 2020 నవంబర్ లో పెళ్లి చేసుకున్నాడు. ఆ బొమ్మ పేరు మార్గో.

మార్గోతో తన జీవితం చాలా సుఖంగా సాగిపోతోందంటున్నాడీ బాడీబిల్డర్. ఈయన చేసిన పనికి కుటుంబం నుంచి కూడా సపోర్టు ఉందట. ఈ మార్గో కేవలం బొమ్మ మాత్రమే కాదు. రోబోలాంటి డాల్. అందులో ప్రొగ్రామ్ కూడా ఉంటుంది. కొన్ని సింపుల్ పదాలు మాట్లాడుతుందట.

ఈ బొమ్మను తొలిసారి 2019లో ఓ బార్ లో చూశాడట. తొలి చూపులోనే ప్రేమ పుట్టిందట. ఆ బార్ లో డోర్ ముందు ఉండే ఈ బొమ్మ.. వచ్చేవారికి వెల్ కమ్ చెబుతుంది. ఓసారి బార్ కి వచ్చిన ఓ వ్యక్తి ఆ బొమ్మతో మిస్ బిహేవ్ చేశాడట. వెంటనే హర్ట్ అయిన ఇతగాడు.. అతన్ని అడ్డుకున్నాడట. ఆ తర్వాత బార్ వాళ్లతో మాట్లాడి తన వెంట తీసుకెళ్లిపోయాడట.

త్వరలోనే మరో సెక్స్ డాల్ ని పెళ్లాడబోతున్నాడట టోలోచ్కో. ఆమె పేరు లోలా. ఓ పెద్ద కోడిలా ఉంటుందట. తనతో దాంపత్య సుఖం కోసం తపించిపోతున్నాడట. జనాలు ఏమనుకుంటారు అనే విషయం ప్రస్తావిస్తే.. 'నా లైఫ్ నా ఇష్టం.. నేను ఎవరినీ పట్టించుకోను' అంటున్నాడు టోలోచ్కో. 'కొందరు నన్ను మోడల్ గా చూస్తారు. మరికొందరు బూతులు తిడతారు. నేను వాటిని అస్సలు పట్టించుకోను' అంటున్నాడు.



Show Full Article
Print Article
Next Story
More Stories