Viral Video: పిల్లో కవర్‌లో వింత శబ్ధం.. ఏంటా అని ఓపెన్‌ చేసి చూడగా, ఫ్యూజుల్‌ అవుట్‌..!

Viral Video: సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే చాలు ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలకు సోషల్‌ మీడియాలో కొదువే ఉండదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Oct 2024 12:10 PM IST
Man Found Snake Inside Pillow Cover Video Goes Viral in Social Media
X

Viral Video: పిల్లో కవర్‌లో వింత శబ్ధం.. ఏంటా అని ఓపెన్‌ చేసి చూడగా, ఫ్యూజుల్‌ అవుట్‌..!

Viral Video: సోషల్‌ మీడియా ఓపెన్‌ చేస్తే చాలు ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలకు సోషల్‌ మీడియాలో కొదువే ఉండదు. ఎక్కడెక్కడో ఉన్న పాములు జనావసాల్లోకి వస్తూ భయపెడుతున్నాయి. ఇటీవల ఇలా పాములు ప్రజల మధ్యకు రావడం ఎక్కువుతోంది. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండడంతో వెంటనే వాటిని కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఇంకేముంది ఆ వీడియోలు క్షణాల్లో ప్రపంచమంతా చుట్టేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అంతలా ఆకట్టుకునే విషయం అందులో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ వ్యక్తి ఇంట్లో హాల్‌లో ఉన్న సోఫాలో కుర్చున్నాడు. అంతలోనే సోఫా పిల్లోలో ఏదో వింత శబ్ధం వినిపించింది.

దీంతో ఇంతకీ ఆ దిండులో ఏముందా.? అనే అనుమానం వచ్చింది. దీంతో అందులో ఏముందని చూసే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. ఆ దిండులో ఓ నాగుపాము దర్శనమిచ్చింది. దీంతో వెంటనే ఈ సమాచారాన్ని స్నేక్‌ హెల్పింగ్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన వాళ్లు పామును బయటకు తీసి వారితో తీసుకెళ్లిపోయారు.

దిండు కవర్‌లో నుంచి పామును బయటకు తీసే సమయంలో పాము ఒక్కసారిగా బుసలు కొట్టింది. దీనంతటినీ అక్కడే ఉన్న వారు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. వామ్మో ఇకపై ఎప్పుడు పిల్లో టచ్‌ చేయాలన్నా భయపడేలా పరిస్థితి ఉంది అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story