Viral Video: మృత్యువు అంచున చిన్నారి.. దేవుడిలా కాపాడిన బస్సు డ్రైవర్.. కేరళలో గుండె ఆగిపోయే దృశ్యం!

Viral Video: అదృష్టం బాగుంటే చావు అంచు వరకు వెళ్లినా ప్రాణాలు దక్కుతాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం.

Arun Chilukuri
Published on: 4 Feb 2026 3:31 PM IST
Viral Video: మృత్యువు అంచున చిన్నారి.. దేవుడిలా కాపాడిన బస్సు డ్రైవర్.. కేరళలో గుండె ఆగిపోయే దృశ్యం!
X

Viral Video: అదృష్టం బాగుంటే చావు అంచు వరకు వెళ్లినా ప్రాణాలు దక్కుతాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కేరళలోని కోజికోడ్ జిల్లాలో ఒక చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. బస్సు డ్రైవర్ చూపిన అసాధారణ సమయస్ఫూర్తి ఆ చిన్నారికి పునర్జన్మనిచ్చింది.

అసలేం జరిగింది?

కోజికోడ్ జిల్లా కొడియత్తూరు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటో వెనుక నుంచి ఒక చిన్నారి అకస్మాత్తుగా రోడ్డు వైపు పరుగెత్తింది. సరిగ్గా అదే సమయంలో ఒక ప్రైవేట్ బస్సు వేగంగా ఆ రోడ్డుపై దూసుకొస్తోంది. అకస్మాత్తుగా చిన్నారి అడ్డు రావడంతో బస్సు ఆమెపైకి ఎక్కేయాల్సింది. కానీ, డ్రైవర్ క్షణాల్లో స్పందించాడు.

డ్రైవర్ చాకచక్యం.. నెటిజన్ల సెల్యూట్:

పాపను గమనించిన వెంటనే డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడమే కాకుండా, బస్సును వేగంగా పక్కకు మళ్లించాడు. దీంతో బస్సు టైర్ల కింద పడాల్సిన చిన్నారి.. కేవలం అంగుళాల దూరంలో ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం తీవ్రతను గ్రహించిన పాప వెంటనే వెనక్కి పరుగెత్తింది. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

తల్లిదండ్రులపై ఆగ్రహం:

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్‌ను నెటిజన్లు రియల్ హీరో అంటూ కొనియాడుతున్నారు. అయితే, చిన్నపిల్లలను రోడ్ల మీదకు ఒంటరిగా వదిలేసిన తల్లిదండ్రులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ఈ రోజు ఒక కుటుంబంలో తీరని శోకం మిగిలేది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story