Cobra Video: 18 అడుగుల కింగ్ కోబ్రాను నిమిషాల్లోనే పట్టేసిన మహిళా ఆఫీసర్.. చూస్తేనే జడుసుకుంటారు

Kerala Lady Officer Catches King Cobra Viral Video 2025
x

Cobra Video: 18 అడుగుల కింగ్ కోబ్రాను నిమిషాల్లోనే పట్టేసిన మహిళా ఆఫీసర్.. చూస్తేనే జడుసుకుంటారు

Highlights

Cobra Video: సామాన్యంగా ఎదుట ఒక చిన్న పాము కనిపించినా మనం భయంతో పరుగులు తీస్తాం.

Cobra Video: సామాన్యంగా ఎదుట ఒక చిన్న పాము కనిపించినా మనం భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా (King Cobra) ఎదురైతే ఏ స్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ కేరళలోని ఓ మహిళా అటవీశాఖ అధికారి మాత్రం అస్సలు భయపడకుండా, గట్టిగుండెతో దాన్ని పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

తిరువనంతపురం జిల్లా పెప్పర ప్రాంతంలోని ఓ నివాస కాలనీలో కింగ్ కోబ్రా కనిపించడంతో స్థానికులు భయంతో తడబడి, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పరుథిపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిణి అక్కడికి చేరుకుని అత్యంత చాకచక్యంగా, ధైర్యంగా 18 అడుగుల పొడవున్న ఆ కోబ్రాను ఓ కట్టె సహాయంతో పట్టుకుని, సంచిలో వేసి సురక్షితంగా బంధించారు.

ఈ ఘటనను చూసిన స్థానికులు ఆవిడ ధైర్యాన్ని అభినందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయ్యింది. నెటిజన్లు ఆమె ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు.

ఆమె గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే — రోషిణి ఇప్పటి వరకు 500కిపైగా పాములను బంధించిన అనుభవం కలిగి ఉన్నారు. ప్రతి సారి ఎంతో సాహసంగా, చాకచక్యంగా పాములను బంధిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. ఈ ఘటన మరోసారి ఆమె సాహసం, అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.


Show Full Article
Print Article
Next Story
More Stories