Viral Video: బతికిపోయా అది చాలు.. భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త..

Kanpur Illicit Affair Husband Arranges Wife Marriage With Lover
x

Viral Video: బతికిపోయా అది చాలు.. భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త..

Highlights

Viral Video: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఓ వివాహేతర సంబంధం ఘటన ఊహించని మలుపు తిరిగింది.

Viral Video: ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఓ వివాహేతర సంబంధం ఘటన ఊహించని మలుపు తిరిగింది. యోగేష్ తివారీ (40) అనే వ్యక్తికి, సోని (30)తో 2010లో వివాహం జరిగింది. వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, కన్నౌజ్‌కు చెందిన వికాస్ ద్వివేది (35) అనే వ్యక్తితో సోనికి కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుండగా, ఈ విషయం యోగేష్‌కు తెలిసింది.

భార్యను పలుమార్లు నచ్చచెప్పినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు చెలరేగాయి. ఇటీవల సోని తన పుట్టింటికి వెళ్లగా, సోమవారం తిరిగి భర్త ఇంటికి వచ్చింది. అదే రోజు వికాస్ కూడా గ్రామానికి రావడం పరిస్థితిని మరింత ఉద్రిక్తతకు గురిచేసింది.

వికాస్‌ను గమనించిన యోగేష్, మరోసారి వారిద్దరి వ్యవహారంపై confront అయ్యాడు. వెంటనే గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా సోని తన మనసులోని మాట బయటపెట్టి… తన ప్రియుడితోనే జీవితం గడపాలని చెప్పింది.

దీంతో 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ, యోగేష్ తన భార్యకు, ఆమె ప్రియుడికి అక్కడే పెళ్లి చేయించాడు. గ్రామస్థుల సమక్షంలో జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ —

“నువ్వు గ్రేట్ భయ్యా”,

“కనీసం ప్రాణాలు అయినా మిగిలాయి”,

“పోతే పోనీలే.. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఘటన ప్రస్తుతం అక్కడ నెట్టింట కూడా చర్చనీయాంశమైంది.


Show Full Article
Print Article
Next Story
More Stories