Viral Video: రీల్స్ పిచ్చితో నడిరోడ్డుపై తుపాకీతో డ్యాన్సులు వేసిన మహిళ.. తర్వాత ఏమై ఉంటుంది?

Viral Video
x

Viral Video: రీల్స్ పిచ్చితో నడిరోడ్డుపై తుపాకీతో డ్యాన్సులు వేసిన మహిళ.. తర్వాత ఏమై ఉంటుంది?

Highlights

Viral Video: ఈ మధ్య రీల్స్ పిచ్చి పీక్స్‌కు చేరుకుంటుంది. ప్రమాదకర ప్రాంతాల్లో కూడా రీల్స్ చేయాలని జనాలు తెగ ఉబలాటపడిపోతున్నారు. దీనివల్ల ఒక్కోసారి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.

Viral Video: ఈ మధ్య రీల్స్ పిచ్చి పీక్స్‌కు చేరుకుంటుంది. ప్రమాదకర ప్రాంతాల్లో కూడా రీల్స్ చేయాలని జనాలు తెగ ఉబలాటపడిపోతున్నారు. దీనివల్ల ఒక్కోసారి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ నడిరోడ్డుపై తుపాకీ పట్టుకుని రీల్స్ చేసింది. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది నెటిజన్లు ఆమెపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

ప్రపంచం అంతా టెక్నాలజీతో ముందుకు పరుగులు పెడుతుంటే కొంతమంది రీల్స్ చేస్తూ.. చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సరదాగా రీల్స్ చేసినంత వరకు పర్వాలేదు కానీ కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాల్లో ప్రమాదకరమైన వస్తువులను పట్టుకుని రీల్స్ చేయడం వ్యసనంగా మారిపోయింది. దీనికి కారణం ఫేమస్ అయిపోవాలనే తపన. అందుకే రకరకాల రీల్స్ చేసేస్తుంటారు. తాజాగా ఓ యువతి చేసిన ఘటనకూడా ఇలాంటిదే. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓ యువతి తన చేతితో తుపాకీ పట్టుకుని రీల్స్ చేసింది. ఈ ఘటన ఛిబ్రామౌ జాతీయ రహదారి 34పై జరిగింది. నడి రోడ్డుపై ఆ యువతి తుపాకీ పట్టుకుని తీసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై పోలీసుల సూమోటో కేసు కూడా వేశారు. సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్దమయ్యారు.



Show Full Article
Print Article
Next Story
More Stories