Viral Video: మ్యాచ్ మధ్యలో ఊడిపడ్డ విగ్గు.. బాక్సర్ ఇచ్చిన ఫన్నీ రీజన్ తెలిస్తే నవ్వాల్సిందే!

Viral Video: బాక్సింగ్ అంటేనే హోరాహోరీగా సాగే పోరాటం. రింగ్‌లో బాక్సర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం సహజం.

Arun Chilukuri
Published on: 2 Feb 2026 11:57 AM IST
Viral Video: మ్యాచ్ మధ్యలో ఊడిపడ్డ విగ్గు.. బాక్సర్ ఇచ్చిన ఫన్నీ రీజన్ తెలిస్తే నవ్వాల్సిందే!
X

Viral Video: బాక్సింగ్ అంటేనే హోరాహోరీగా సాగే పోరాటం. రింగ్‌లో బాక్సర్లు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం సహజం. అయితే, అమెరికాలోని ప్రఖ్యాత 'మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్' వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో మాత్రం ఒక అరుదైన, అత్యంత సరదా ఘటన చోటుచేసుకుంది. అమెరికన్ బాక్సర్ జారెల్ "బిగ్ బేబీ" మిల్లర్ తలకు పెట్టుకున్న విగ్గు, మ్యాచ్ మధ్యలోనే ఊడి కిందపడిపోయింది.

అసలేం జరిగిందంటే? జారెల్ మిల్లర్, కింగ్స్లీ ఇబే మధ్య బాక్సింగ్ బౌట్ హోరాహోరీగా సాగుతోంది. రెండో రౌండ్‌లో ఇబే వరుసగా పంచ్‌లు విసురుతుండగా.. జారెల్ తలకు ఉన్న విగ్గు ఒక్కసారిగా కదిలి రింగ్‌లో పడిపోయింది. ఊహించని ఈ పరిణామంతో ప్రేక్షకులందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే, జారెల్ ఏమాత్రం తడబడకుండా, ఆ విగ్గును తీసి ప్రేక్షకుల వైపు విసిరేసి తన పోరాటాన్ని కొనసాగించాడు.

అమ్మ వాడిన షాంపూయే కారణం!

మ్యాచ్ ముగిసిన తర్వాత తన విగ్గు వ్యవహారంపై జారెల్ మిల్లర్ వివరణ ఇస్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు. "రెండు రోజుల క్రితం మా అమ్మ ఇంట్లో ఉన్న షాంపూతో తలస్నానం చేశాను. అది స్ట్రాంగ్ బ్లీచ్ కావడంతో నా జుట్టు మొత్తం రాలిపోయింది. దీంతో వెంటనే మా మేనేజర్‌తో విగ్గు తెప్పించుకుని రింగ్‌లోకి దిగాను. నేనో కమెడియన్‌ని, నాపై నేనే జోకులు వేసుకోగలను" అంటూ చమత్కరించాడు.

ప్రస్తుతం ఈ విగ్గు ఊడిపోయిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. బాక్సర్ స్పోర్టివ్ నెస్‌కు నెటిజన్లు ఫిదా అవుతూ ఫన్నీ మీమ్స్‌తో షేర్ చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story