Money Savings: ఈ అలవాట్లు ఉంటే డబ్బు చేతిలో నిలవదు..!

If you Have These 4 bad Habits Then Money Will not be in Hand Better to Leave it
x

Money Savings: ఈ అలవాట్లు ఉంటే డబ్బు చేతిలో నిలవదు..!

Highlights

Money Savings: మీరు చాలా మందిని చూసి ఉంటారు. సంపాదన బాగానే ఉంటుంది కానీ తరచుగా బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేస్తుంటారు

Money Savings: మీరు చాలా మందిని చూసి ఉంటారు. సంపాదన బాగానే ఉంటుంది కానీ తరచుగా బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేస్తుంటారు. దీనికి కారణం వారి చేతిలో డబ్బు నిలవకపోవడమే. మీకు ఇలాంటి ఇబ్బంది ఎదురైతే మీరు చేసే పొరపాట్ల గురించి తెలుసుకోండి. వాటిని సరిచేసుకుంటే లక్ష్మిదేవి ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. డబ్బు విషయంలో మీరు చేసే తప్పులపై ఓ లుక్కేద్దాం.

అనవసరంగా షాపింగ్

ప్రజలు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం సాధారణం. కానీ కొంతమంది అవసరం లేకున్నా షాపింగ్‌ చేస్తుంటారు. ప్రతి వారం లేదా ప్రతి నెలా షాపింగ్‌కు వెళతారు. ఈ విధమైన షాపింగ్‌లో కొనుగోలు చేసిన వస్తువులు వారికి ఉపయోగపడవు. తద్వారా వారి డబ్బు వృధా అవుతుంది. మీరు ఇలా తరచుగా షాపింగ్‌ చేసేవారైతే మానుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

స్నేహితులతో పార్టీలు

కొన్నిసార్లు ప్రత్యేక సందర్భంలో స్నేహితులతో పార్టీ చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఈ విందులు రోజుకో విషయంగా మారితే అది తీవ్రమైన సమస్యగా మారుతుంది. మీరు ప్రతిసారీ 500-1000 రూపాయలు కోల్పోతారు. నెలలో 15 రోజులు ఇలాంటి పార్టీలు చేస్తే తెలియకుండానే 15 వేల రూపాయలు నష్టపోతారు. ఈ 15 వేల రూపాయలు మీ కుటుంబానికి ఎంత మేలు చేయగలరో ఆలోచించండి. అందువల్ల వీలైతే పార్టీలు తగ్గించండి.

సంపాదన కంటే ఎక్కువ ఖర్చు

మన దేశంలో ఒక సామెత ఉంది. ఆర్థిక స్థితి ఎంత ఎక్కువ ఉంటే అంత డబ్బు ఖర్చు పెట్టాలి. కానీ చాలా మంది పెద్దలు దీనిని పట్టించుకోరు. అందుకే సంపాదనకు మించి ఖర్చు చేసి, ఇతరుల నుంచి అప్పుల కోసం చేతులు చాపుతారు. ఇలాంటి అలవాటు ఉన్న వ్యక్తులు జీవితంలో ఎప్పుడు పైకి రాలేరు. నిత్యం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటు ఉంటారు. అందుకే జీవితంలో ఆనందం కావాలంటే సంపాదనకు తగ్గట్టుగా ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి.

ఖరీదైన వస్తువుల కొనుగోలు

కొంతమంది స్నేహితులు, బంధువులను ఆకట్టుకోవడానికి ఒకటి కంటే ఎక్కువ ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అలాంటి వ్యక్తులు బేరసారాలు చేయరు. నాణ్యతను పట్టించుకోరు. ఎంత ఎక్కువ ధర పలికితే అంత మంచిదని భావిస్తారు. ఇలాంటి వ్యక్తులు కూడా తరచూ ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కొంటూ ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories