Tips: మేడపై మర్రి చెట్టు పెరుగుతోందా.? ఏం చేయాలంటే..

How to Safely Remove Trees Growing on Roofs and Walls of Houses
x

Tips: మేడపై మర్రి చెట్టు పెరుగుతోందా.? ఏం చేయాలంటే..

Highlights

ఇళ్ల పైకప్పులు, టెర్రస్ పై లేదా గోడల మధ్యలో మొక్కలు మొలకెత్తడం సర్వసాధారణమైన విషయం. అయితే దీనిని లైట్ తీసుకుంటే మాత్రం తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వేర్లు బలంగా విస్తరించి గోడలు కూలిపోవడానికి కూడా కారణమవుతుంటాయి.

ఇళ్ల పైకప్పులు, టెర్రస్ పై లేదా గోడల మధ్యలో మొక్కలు మొలకెత్తడం సర్వసాధారణమైన విషయం. అయితే దీనిని లైట్ తీసుకుంటే మాత్రం తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వేర్లు బలంగా విస్తరించి గోడలు కూలిపోవడానికి కూడా కారణమవుతుంటాయి. అందుకే ఇళ్లపై రావి లేదా మర్రి మొక్కలు పెరిగితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ప‌క్షులు ఈ మొక్క‌ల విత్త‌నాల‌ను తింటూ మేడ‌పై ప‌డేస్తుంటాయి. వ‌ర్షం నీరు కార‌ణంగా ఆ విత్త‌నాలు నెమ్మ‌దిగా మొక్క‌గా మార‌డం ప్రారంభ‌మ‌వుతుంది. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద‌గా స‌మ‌స్య ఉండ‌దు. కానీ వాటి వేర్లు లోతుగా చొచ్చుకుపోయి గోడలు, పైకప్పుల‌ను క‌దిలిస్తాయి. ఇది వర్షాకాలంలో మరింత తీవ్రమవుతుంది. గోడల్లో పగుళ్లు ఏర్పడడం, నీటి లీకేజీలు మొదలవడం, క్రమంగా ఇంటి స్థిరత్వాన్ని దెబ్బతీయడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

అయితే హిందూ సంప్రదాయంలో రావి, మర్రి వంటి చెట్లను పవిత్రంగా భావిస్తారు. దీంతో కొంతమంది అవి ఇళ్లపై పెరిగినప్పటికీ తొలగించడానికి ఆస‌క్తి చూపించ‌రు. కానీ ఆచారాల కంటే ఇంటి భద్రత ముఖ్యం. ధార్మిక విశ్వాసాలతో పాటు నిర్మాణ రక్షణను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఇంటి పై మొక్కలను ఎలా తొలగించాలి?

చిన్న మొక్కలు పెరిగిన వెంటనే చేతితో జాగ్రత్తగా పీకేయాలి. వేర్లు పూర్తిగా బయటకు తీయాలి. అవసరమైతే గోరువెచ్చని నీటిని మొక్క ఆధార భాగంలో పోసి వేర్లను తేలికగా కదిలించవచ్చు. పదునైన గునపం ఉపయోగించి మట్టిని కదిలించి మొక్కను వేర్లతో సహా తీసేయాలి.

మధ్యస్థాయి మొక్కలు

మధ్యస్థాయిలో ఉన్న మొక్కలను మొదట కత్తిరించి, వేర్లలో రెండు లేదా మూడు రంధ్రాలు వేయాలి. ఆ రంధ్రాల్లో ఉప్పు లేదా నీటితో కలపని బ్లీచ్ పోసితే, వేర్లు ఎండిపోయి క్రమంగా మరణిస్తాయి. ఈ ప్రక్రియను కొన్ని రోజులు రిపీట్ చేయాలి. మార్కెట్‌లో ప్రత్యేక కెమికల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించేటప్పుడు గ్లౌజులు ధరించి జాగ్రత్తగా వాడాలి.

పెద్ద చెట్లు

వేర్లు లోతుగా ప్రవేశించిన పెద్ద చెట్ల తొలగింపున‌కు నిపుణుల సహాయం అవసరం. గార్డెనర్లు లేదా బిల్డింగ్ కాంట్రాక్టర్లు చెట్టును కత్తిరించి కెమికల్ ట్రీట్‌మెంట్ లేదా తవ్వే పద్ధతిలో పూర్తిగా తొలగిస్తారు. ఇక చెట్టు తొలగింపుతో ఏర్పడిన పగుళ్లను వెంటనే సిమెంట్ లేదా వాటర్‌ప్రూఫ్ కాంపౌండ్‌తో నింపాలి. పైకప్పు లేదా గోడలను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి. డ్రెయిన్లు, మూలలు విత్తనాలు చేరకుండా చూసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories