Bike Riders: బైక్‌పై ఒకేసారి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.. రైడర్స్‌కి ఈ అవగాహన తప్పనిసరి..!

How Many Kilometers can be Traveled on a Bike at a Time This Awareness is a Must for Riders
x

Bike Riders: బైక్‌పై ఒకేసారి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.. రైడర్స్‌కి ఈ అవగాహన తప్పనిసరి..!

Highlights

Bike Riders: భారతదేశంలో ఫోర్‌ వీలర్స్‌ కంటే టూ వీలర్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు.

Bike Riders: భారతదేశంలో ఫోర్‌ వీలర్స్‌ కంటే టూ వీలర్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తారు. బజారుకు వెళ్లడం నుంచి స్కూల్, కాలేజీ, ఆఫీసుకు వెళ్లే వరకు అందరు మోటారు సైకిళ్లపైనే ఆధారపడుతారు. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్‌లు ప్రధాన సమస్యగా ఉన్న నగరాల్లో రోజువారీ ప్రయాణానికి మోటార్‌సైకిల్ ఉత్తమంగా భావిస్తారు. అలాగే బైక్‌ను ఉపయోగించి దూర ప్రయాణాలకు వెళ్లే వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే మోటార్ సైకిల్‌పై ఒకేసారి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలో తెలిసి ఉండాలి. లేదంటే రకరకాల సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.

బైక్‌పై ఒకేసారి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలనేది ప్రధానంగా బైక్, డ్రైవర్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణ ఎయిర్ కూల్డ్ 100-150 cc బైక్‌లైతే ప్రతి 50 కి.మీ లేదా 1 గంట రైడ్ తర్వాత ఐదు నిమిషాల విరామం తీసుకోవాలి. 150 సిసి బైక్‌తో మీరు గరిష్టంగా 100 కిలోమీటర్లు డ్రైవ్ చేయవచ్చు. తర్వాత 10 నిమిషాల విరామం తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరం త్వరగా అలసిపోదు. బైక్ ఇంజన్ కూడా విశ్రాంతి పొందుతుంది.

ఎక్కువసేపు బైక్‌ను నడపడం వల్ల ఇంజిన్‌పై చెడు ప్రభావం పడుతుంది. అది త్వరగా వేడెక్కుతుంది. అంతేకాదు ఎక్కువ సేపు బైక్ నడపడం వల్ల మెడ, వీపు, కాళ్లలో నొప్పి ఏర్పడుతుంది. అందుకే బైక్‌కే కాదు మీకు కూడా విశ్రాంతి లభించినట్లవుతుంది. సుదీర్ఘ ప్రయాణాన్ని భాగాలుగా విభజించి విరామం తీసుకోవడం అవసరం. ఉదాహరణకు ఒక రోజులో 400 కి.మీ దూరం వెళ్లాలనుకుంటే 100 కి.మీ చొప్పున విరామం తీసుకోవడం ఉత్తమం. ఆగినప్పుడు కొన్ని ఫలహారాలు తీసుకుంటే శరీరం రిఫ్రెష్‌ అవుతుంది. అలాగే ఆగినప్పుడు కొంచెం అటు ఇటు తిరగండి. లేదరంటే ఎక్కువ సేపు రైడింగ్ చేయడం వల్ల కండరాలు నొప్పులు సంభవిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories