బుడ్డోడి డ్యాన్స్..లావణ్య ట్వీట్.. నెటిజన్లు ఫ్లాట్!

బుడ్డోడి డ్యాన్స్..లావణ్య ట్వీట్.. నెటిజన్లు ఫ్లాట్!
x
Highlights

Heroine Lavanya Tripathi : హీరోయిన్ లావణ్య త్రిపాఠి ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ సూపర్ ఫాం లో ఉంటున్నారు. మన నటుల్లో చాలా మంది ఎప్పటికప్పుడు తమ అప్ డేట్స్ ను అభిమానులకు పంచడమే కాకుండా.. తాము చూసిన విశేషాలను కూడా సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిసేలా చేస్తున్నారు. అందులో సామజికంశాలతో పాటు.. తమ దృష్టికి వచ్చిన సరదా విషయాలూ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ట్విట్టర్ లో ఓ ఉల్లాసాన్నిచ్చే వీడియోను పంచుకున్నారు. అది ఇప్పుడు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందులో విశేషం ఏమిటంటే..

సాధారణంగా కుక్కపిల్లలు అంటే పిల్లలకు చాలా ఇష్టం ఉంటుంది. వాటితో ఆడుకోవడానికి తెగ సరదా పడిపోతారు. వాటితో ఆడుకునే చిన్నారులు చేసే చేష్టలు చూస్తె మనకూ సరదాగా అనిపిస్తుంది. అలా ఓ బుడ్డోడు కుక్క పిల్లల్ని ఆటపట్టిస్తూ చేసిన డాన్స్ వీడియో అది. ఆ వీడియోలో ఒక ఇంటి కాంపౌండ్ లో గేటు లోపల రెండు కుక్క పిల్లలు.. గేటుకు అవతల వైపు మనం ఇప్పుడు చెప్పుకుంటున్న లిటిల్ హీరో బుడ్డోడు ఉన్నారు. గేటు అవతల ఉన్న బాలుడిపై ఆ రెండు కుక్కలు అరుస్తూ దూకుతూ పట్టుకోవాలని ఆరాట పడిపోతున్నాయి. వాటిని టీజ్ చేస్తూ మన బుడ్డోడు తెగ రెచ్చిపోయి డాన్స్ చేసేశాడు. ఈ బుడ్డోడు చేసిన చిలిపి చేష్టలు ఇప్పుడు నెటిజన్లకు తెగ నచ్చేశాయి. అందరూ ఆ వీడియో చూసి తెగ నవ్వుకుంటున్నారు.

అన్నట్టు ఈ వీడియో పోస్ట్ చేస్తూ లావణ్య త్రిపాఠి '''ఈ ఉదయం మీ ముఖంపై నవ్వులు పూయిస్తూ.. ప్రకాశవంతం చేయడానికి ఇది చూడండి'' అని కామెంట్ చూశారు. ఈ ట్విట్టర్ సందేశాన్ని చూసిన వారంతా ఆమెకు సమాధానంగా సూపర్ కామెంట్లు పెడుతున్నారు. ''గేటు సందులోంచి దూరి ఆ కుక్క పిల్లలు బయటకు వస్తే బుడ్డోడి పరిస్థితి ఏమిటి?'' అని ఒకరు.. ఇది కూడా చూడు డింపుల్ అని మరో బుడ్డోడు కుక్కపిల్లతో ఆడుతున్న వీడియో మరొకరు..ఇలా కామెంట్లతో ఈ వీడియో కి ఫిదా అయిపోతున్నారు. మరి ఆలస్యం ఎందుకు మీరు చూసేయండి ఆ బుడ్డోడి డాన్స్..



Show Full Article
Print Article
Next Story
More Stories