నోట్లో పెట్టుకున్న సిగరెట్ తో రాకెట్లను కాల్చుతున్నాడు.. ఔరా అనాల్సిందే

నోట్లో పెట్టుకున్న సిగరెట్ తో రాకెట్లను కాల్చుతున్నాడు.. ఔరా అనాల్సిందే
x
Highlights

దీపావళి అంటేనే టపాకాయలు, మతాబులు, చిచ్చుబుడ్డులు, థౌజండ్‌వాలాలు .. ఎన్ని కాల్చినా, ఎంత కాల్చినా తక్కువే అనిపిస్తుంది. నిన్న దేశ వ్యాప్తంగా జరిగిన...

దీపావళి అంటేనే టపాకాయలు, మతాబులు, చిచ్చుబుడ్డులు, థౌజండ్‌వాలాలు .. ఎన్ని కాల్చినా, ఎంత కాల్చినా తక్కువే అనిపిస్తుంది. నిన్న దేశ వ్యాప్తంగా జరిగిన దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా కుటుంబంతో, స్నేహితులతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు. అబ్బాయిలకి ధీటుగా అమ్మాయిలు కూడా టపాకాయలను కాల్చారు.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు చెప్పెబోయే పెద్దమనిషి మాత్రం మన అందరిలా టపాకాయలు కాల్చడం కాదు. తనకంటూ ఓ ఓన్ స్టైల్ తో కాల్చుతున్నాడు.. అది కూడా రాకెట్లును పెల్చుతున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అ వ్యక్తి తన చేతిలో అరడజను రాకెట్లును ఉంచుకొని, నోటిలో సిగరెట్ పెట్టుకొని ఆ సిగరెట్‌కు తన చేతిలో ఉన్న రాకెట్లను ఒకదానివెంట మరొకటి అంటిస్తూ పైకి వదిలాడు. ఆ అరడజన్ రాకెట్లు కేవలం నిమిషంలోనే అయిపోయాయి.. ఈ వీడియో చూసిన వారు ఔరా ఏమి సాహసం అని ఆశ్చర్యపోతున్నారు.. ఒక్కసారి చూడండి మీరు కూడా ఔరా అనకుండా ఉండలేరు మరి..Show Full Article
Print Article
More On
Next Story
More Stories