Viral Video: రెండు గుర్రాల మ‌ధ్య పోట్లాట ఎప్పుడైనా చూశారా..!

Viral Video: ఇందులో జంతువుల వీడియోలు నెటిజ‌న్లను బాగా ఆక‌ర్షిస్తాయి. ఈ వీడియోలో ఉండే ఉత్కంఠ‌ని వారు బాగా ఎంజాయ్ చేస్తారు

hmtv Digital Team
Updated on: 31 Oct 2021 8:39 PM IST
Have you Ever Seen a Fight Between two Horses Viral Video
X

గుర్రాల ఫైటింగ్ (ఫైల్ ఇమేజ్)

Viral Video: ప్ర‌తిరోజు సోష‌ల్ మీడియాలో చాలా వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇందులో జంతువుల వీడియోలు నెటిజ‌న్లను బాగా ఆక‌ర్షిస్తాయి. ఈ వీడియోలో ఉండే ఉత్కంఠ‌ని వారు బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు షేర్స్‌, కామెంట్స్‌, లైక్స్ చేసి ఆద‌రిస్తారు. అయితే ఇందులో కొన్ని ఫైటింగ్ వీడియోలు, మ‌రికొన్ని ఫ‌న్నీ వీడియోలు, ఇంకొన్ని భ‌యంక‌ర వీడియోలు ఉంటాయి. ఇవి జంతువుల ప్ర‌వ‌ర్త‌నా శైలిని తెలుపుతాయి. తాజాగా ఓ రెండు గుర్రాలు పొట్లాడుకునే వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. నెటిజ‌న్లు ఈ వీడియోను ప‌దే ప‌దే చూసి ఆనందిస్తున్నారు.

వీడియోలో గుర్రాల రేసు జ‌రుగుతుండ‌టం మనం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇందులో రెండు గుర్రాలు ప‌రుగెత్తుతూ మ‌ధ్య‌లో ఆగి పోట్లాడుకుంటాయి. ఈ సీను సోష‌ల్ మీడియా వినియోగ‌దారుల‌ను తెగ ఆక‌ట్టుకుంటుంది. రెండు గుర్రాలు కూడా చాలా అందంగా చూడ ముచ్చ‌ట‌గా ఉండ‌టం మ‌నం వీడియోలో చూడ‌వ‌చ్చు. కొద్దిసేపు అలా పోట్లాడుకొని తిరిగి మ‌ళ్లీ వేగంగా రేసులో పాల్గొంటాయి. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన నెట‌జ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు యాభైవేల‌మంది చూశారు. ప్ర‌జ‌లు బాగా ఆనందిస్తున్నారు. ఒక నెటిజ‌న్ ఇలా చెప్పాడు. 'నేను మొదటిసారిగా గుర్రాల పోరాటాన్ని చూశాను' అని రాశాడు. అదే సమయంలో మరొక వినియోగదారు ఇలా రాశాడు 'ఇప్పటి వరకు నేను గుర్రాన్ని అత్యంత ప్రశాంతంగా భావించాను కానీ ఈ వీడియో చూసిన తర్వాత నా ఆలోచనను మార్చుకున్నాన‌ని' తెలిపాడు. జంతువుల కంటెంట్‌కు సోషల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే వీటికి సంబందించిన వీడియోలు త‌ర‌చూ వైర‌ల్‌గా మారుతుంటాయి. మీరు ఈ వీడియో చూస్తే మీ కామెంట్ తెలియ‌జేయండి.


hmtv Digital Team

hmtv Digital Team

Next Story