'రిమూవ్ చైనా యాప్స్' యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్!

రిమూవ్ చైనా యాప్స్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్!
x
Highlights

చైనా యాప్ లకు అడ్డంకిగా మారిన యాప్ లను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్టు కనిపిస్తోంది.

కరోనా భూతాన్ని ప్రజల మీదకు వదిలిందని ప్రపంచంలో చాలా మంది ప్రజలు చైనా పై విరుచుకుపడుతున్నారు. ఆ విషయంలో ఏం జరిగిందనేది పక్కన పెడితే, ఈ కారణంతో ప్రపంచ వ్యాప్తంగా చైనా వస్తువుల వాడకాన్ని మానేయాలనే భావన చాలా మందిలో నెలకొని ఉంది. ఈ కారణంగా సోషల్ మీడియాలో చైనా వస్తువులను నిషేధించాలని ప్రత్యెక టాగ్స్ తో ప్రచారమూ సాగుతోంది.

ఈ నేపధ్యంలో ఫోన్లలో చైనా యాప్ లను బహిష్కరించాలనే బలమైన వాదనా మొదలైంది. ఇక ఈ విషయంలో భారతదేశంలో అయితే, చాలా ఎక్కువగా ప్రచారం జరుగుతూ వస్తోంది. భారతీయులకు, చైనీయులకు మధ్య ఉన్న విబేదాల దృష్ట్యా ఇది మరింత ఉధృతంగా మారింది. చైనా యాప్ లను ఫోన్ల నుంచి తొలగించడానికి ఒక ప్రత్యేకమైన యాప్ ను భారత్ కు చెందిన వన్ టచ్ యాప్ ల్యాబ్స్ ఒక ప్రత్యేకమైన యాప్ ను తయారుచేసింది. ''రిమూవ్ చైనా యాప్స్'' పేరుతొ విడుదల చేసిన ఈ యాప్ ప్రజల్లో దూసుకుపోయింది. 5 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ లు చేసుకున్నారు ఈ యాప్ ను. అంటే అంతమంది చైనా యాప్ లను ఒక్క క్లిక్ తో తమ ఫోన్ల నుంచి తొలగించేశారన్నమాట.

ఇప్పుడు ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. ఈ విషయాన్ని వన్ టచ్ యాప్ ల్యాబ్స్ ట్విట్టర్ లో తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తమ యాప్ ను ఎందుకు తొలగించారో కారణాలు తెలియలేదని కంపెనీ చెప్పింది. ఇంతకు ముందు చైనా కు చెందిన 'టిక్ టాక్' యాప్ కు ప్రత్యామ్నాయంగా భావించిన 'మిత్రాన్' యాప్ ను కూడా గూగుల్ తన ప్లేస్తోర్ నుంచి తోఅలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ యాప్ ను కూడా ప్;ప్లే స్టోర్ నుంచి తొలగించడం సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది.

''రిమూవ్ చైనా యాప్స్''ను మన దేశంలో ఒక మిలియన్ మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. వారికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. కొత్తగా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఈ యాప్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండదు. ఈ యాప్ యాపిల్ డివైస్ లలో పనిచేయదు.ఈ యాప్ మే 17 వతేదీన ప్లే స్టోర్ లో అందుబాటులోకి వచ్చింది. 4.8 రేటింగ్ తో దూసుకుపోయింది. దీనికి వచ్చిన రివ్యూలు కూడా చాలా అనుకూలంగా వచ్చాయి. అయినప్పటికీ దీనిని గూగోల్ తొలగించడం విశేషం.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories