Viral Video: సింహానికి గ‌ట్టి షాక్ ఇచ్చిన జిరాఫీ..

* సింహం పంజా విసిరిందంటే ఆహారం కావాల్సిందే * ఈ వీడియో చూసిన జ‌నాలు షాక్ అవుతున్నారు

hmtv Digital Team
Updated on: 29 Oct 2021 2:00 PM IST
Giraffe Giving Gouty Shock to Lion Viral Video | How do Giraffes Fight Lions?
X

సింహానికి గ‌ట్టి షాక్ ఇచ్చిన జిరాఫీ (ఫైల్ ఫోటో)

Giraffe Fighting Lion - Viral Video: సోష‌ల్ మీడియాలో జంతువుల వీడియోల‌కు ఫ్యాన్స్ ఎక్కువ‌గా ఉంటారు. చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తారు. అందుకే ఎక్కువ‌గా వైర‌ల్ అవుతుంటాయి. అంతేకాదు వీడియోను ప‌దే ప‌దే చూస్తూ ఆనందిస్తారు. షేర్స్‌, కామెంట్ చేస్తారు. ఇందులో ఎక్కువ‌గా జంతువుల వేట‌కు సంబంధించిన వీడియోలే వైర‌ల్‌గా మారుతాయి. తాజాగా జిరాఫీ పై దాడికి య‌త్నించిన సింహానికి అనుకోని ఎదురుదెబ్బ త‌గులుతుంది. వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు.

సాధారణంగా అడ‌విలో సింహాన్ని చూసి జంతువుల‌న్నీ పారిపోతుంటాయి. ఎందుకంటే సింహం పంజా విసిరిందంటే ఆహారం కావాల్సిందే. కానీ ఈ వీడియోలో కొంచెం భిన్నంగా జ‌రిగింది. జిరాఫీ పై అటాక్ చేసిన సింహాన్ని కాళ్లతో త‌న్న‌డం మ‌నం వీడియోలో చూడ‌వ‌చ్చు.

జిరాఫీ పొడుగ్గా ఉంటుంది. దాని కాళ్లు కూడా పొడుగ్గా ఉంటాయి. అయితే వీడియోలో జిరాఫీ మెడ‌ను టార్గెట్ చేసిన సింహం ఒక్క‌సారిగా దానిపై దూకుతుంది. కానీ జిరాఫీ తెలివిగా దానిని కింద‌ప‌డేసి పొడ‌వాటి కాళ్ల‌తో త‌న్నిత‌ప్పించుకోవ‌డం వీడియోలో గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ విధంగా జిరాఫీ త‌న ప్రాణాల‌ను కాపాడుకుంటుంది. త‌న పొడ‌వైన కాళ్లు మాత్ర‌మే దానికి ఆయుధాల‌ని చెప్ప‌వ‌చ్చు.ఈ వీడియో చూసిన జ‌నాలు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ ఫారమ్‌లలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను 'లైఫ్ అండ్ నేచర్' ట్విట్టర్‌లో షేర్ చేసింది. వీడియో చూసిన తర్వాత ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు అంతేకాదు చాలా ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను నాలుగు వేల మందికి పైగా వీక్షించారు. మీకు న‌చ్చితే మీరు కామెంట్ చేయండి.


hmtv Digital Team

hmtv Digital Team

Next Story