నేడు "తెలుగు భాషా దినోత్సవం" - తెలుగు వెలుగును పెంచిన గిడుగు వారు!

Srikanth Kondapalli
Updated on: 29 Aug 2019 10:26 AM IST
నేడు తెలుగు భాషా దినోత్సవం - తెలుగు వెలుగును పెంచిన గిడుగు వారు!
X

తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామ్మూర్తి గారి పుట్టిన రోజు ఈ రోజు..... ముఖ్యంగా గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని, ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు మన రామ్మూర్తి గారు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు.

గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు అయిన ఈ రోజు...ఆగష్టు 29 ని "తెలుగు భాషా దినోత్సవం"గా జరుపుకుంటున్నాము. అయితే...ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణా వేరుపడిన తరువాత తెలంగాణా వారు కాళోజీ జన్మదినోత్సవాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు అందరం తెలుగులోనే మాట్లాడుదాము, తెలుగు తియ్యదనాన్ని ఆస్వాదిద్దాం.

Srikanth Kondapalli

Srikanth Kondapalli

Next Story