Funny Video: వ‌రుడికి దండ వేయ‌డానికి తిప్ప‌లు ప‌డిన వ‌ధువు..!

Funny Video of the Bride and Groom at the Wedding
x

వైరల్ వీడియో (ఫోటో ఇన్‌స్టాగ్రామ్) 

Highlights

Funny Video: వివాహం అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో గొప్ప వేడుక‌. అందుకే అంద‌రు ఈ వేడుక‌ను గ్రాండ్‌గా జ‌రుపుకుంటారు

Funny Video: వివాహం అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో గొప్ప వేడుక‌. అందుకే అంద‌రు ఈ వేడుక‌ను గ్రాండ్‌గా జ‌రుపుకుంటారు. కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితుల‌ను ఆహ్వానించి వారికి విందు, వినోదాలు ఏర్పాటు చేస్తారు. వారి ఆశీస్సుల‌ను తీసుకొని స‌ర‌దాగా గ‌డుపుతారు. అయితే వివాహ వేడుక‌లో కొన్ని ఆచార సంప్ర‌దాయాలు ఉంటాయి. వాటి ప్ర‌కార‌మే అన్నీ జ‌రుగుతాయి. ఈ సంద‌ర్భంలో వ‌ధూవ‌రుల మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాలు ఫ‌న్నీగా ఉంటాయి. చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటాయి. ఇటువంటి స‌న్నివేశాలు జీవితాంతం వారికి గుర్తుగా ఉండిపోతాయి. తాజాగా ఓ పెళ్లి వేడుక‌లో వ‌ధువు వ‌రుడి మెడ‌లో మాల వేసే వీడియో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు ఈ వీడియోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

వీడియోలో వ‌ధువు, వ‌రుడి మెడ‌ల మాల వేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం మ‌నం చూడ‌వ‌చ్చు. వ‌ధువుని కొంత‌మంది ఎత్తుకుంటారు. అలాగే వ‌రుడిని కూడా కొంత‌మంది ఎత్తుకుంటారు. ఆ స‌మ‌యంలో వ‌ధువు వ‌రుడి మెడ‌లో మాల వేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. కానీ వ‌రుడు మారాం చేస్తూ మాల మెడ‌లో ప‌డ‌కుండా దూరం దూరం జ‌రుగుతుండ‌టం మ‌నం వీడియోలో గ‌మ‌నించవ‌చ్చు. ఈ ఫ‌న్నీ స‌న్నివేశం చూప‌రుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. ప్ర‌తి ఒక్క‌రి వివాహ వేడుక‌ల‌ను గుర్తు చేస్తుంది. అయితే చివ‌రికి ఎలాగోలా వ‌ధువు వ‌రుడి మెడ‌ల మాల వేస్తుంది. దీంతో అంద‌రు సంతోషిస్తారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు తెగ స్పందిస్తున్నారు. ర‌క‌ర‌కాల కామెంట్లు, లైక్స్‌, షేర్స్‌ చేస్తున్నారు. ఒక నెటిజ‌న్ ఈ విధంగా స్పందించాడు. ఈ వీడియో త‌న వివాహ వేడుకను గుర్తు చేస్తుంద‌న్నాడు. మ‌రొక‌రు ఇలాంటి ఫ‌న్నీ స‌న్నివేశాలు వివాహానికి మంచి గుర్తింపును తీసుకువ‌స్తాయ‌ని చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వీడియోను వేల సంఖ్య‌లో వీక్షించారు. మీరు ఈ వీడియోను చూస్తే మీ కామెంట్ తెలియ‌జేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories