Viral Video: వామ్మో ఒక్క అరటి పండు 100 రూపాయలా?

Single banana cost Rs 100
x

Viral Video: వామ్మో ఒక్క అరటి పండు 100 రూపాయలా? 

Highlights

Single banana cost Rs 100: ఒక్క అరటి పండు రూ.100లు. ఇదేక్కడో ఫారెన్‌లో అనుకుంటున్నారా? కాదు మన హైదరాబాద్‌లోనే. ఒక్క అరటి పండు రూ.100 ఏంటి...

Single banana cost Rs 100: ఒక్క అరటి పండు రూ.100లు. ఇదేక్కడో ఫారెన్‌లో అనుకుంటున్నారా? కాదు మన హైదరాబాద్‌లోనే. ఒక్క అరటి పండు రూ.100 ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు వింటున్నది నిజామే. ఓ విదేశీ యువకుడికి ఒక్క బనానా వంద రూపాయలు అని చెప్పి అతన్ని షాక్‌కి గురిచేశాడు హైదరాబాద్ అరటి పండ్ల వ్యాపారి. ఈ ఘటన మొజాంజాహీ మార్కెట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిది. ధర కూడా నార్మల్‌గానే ఉంటుంది. వీటిని డజన్ల లెక్క అమ్ముతూ ఉంటారు. డజన్ అరటి పండ్ల సీజన్‌నుబట్టి ధర రూ.60 నుంచి రూ.80 వరకు ఉంటుంది. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ అరటి పండ్ల వ్యాపారి మాత్రం ఒక్క అరటి పండును ఏకంగా రూ.100 అమ్ముతున్నట్టు చెప్పాడు. అది కూడా స్థానికుడికి కాదు.. ఓ విదేశీయుడికి. దీంతో ఆ విదేశీయుడు షాక్ అయ్యాడు.

ఆ విదేశీ యువకుడు హగ్ భారత పర్యటనలో భాగంగా.. ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. రోడ్డుపై వెళ్తున్న తోపుడు బండి వద్ద అరటిపండు ధర ఎంత అని అడిగాడు. దాంతో అతను వంద రూపాయలు అని చెప్పాడు. ఆశ్చర్యపోయిన ఆ యువకుడు మరోసారి అడిగాడు. అయితే ఆ వ్యాపారి మరోసారి కూడా వంద రూపాయలు అంటూ హిందీ, ఇంగ్లీష్‌లో చెప్పాడు.

అది విన్న అతను అంత ధర.. నేను కొనలేను అని వెనక్కి తగ్గాడు. యూకేలో అయితే 8 అరటి పండ్లు వస్తాయని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను హాగ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వింత అనుభవం రష్యన్ యువకుడికి హైదరాబాద్‌లోనే ఎదురైంది. విదేశీయుడి ముఖం చూసి ఎక్కువ డబ్బులు వసూలు చేయొచ్చనే ఉద్దేశంతో అలా ఒక అరటి పండుకు రూ.100 చెప్పి హైదరాబాద్ పరువు తీశారని కొంతమంది నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories