Tire Puncture: వేసవిలో టైర్‌ పంక్చర్ నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

Follow These Tips to get Rid of Tire Puncture in Summer
x

Tire Puncture: వేసవిలో టైర్‌ పంక్చర్ నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

Highlights

Tire Puncture: వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Tire Puncture: వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో మీ కారును జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా కార్ల టైర్లని పదే పదే గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే రోడ్డుపై వేడివల్ల తరచూ పంక్చర్‌ అయ్యే సమస్యలు ఉంటాయి. అంతేకాదు ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ పరిస్థితిలో కారు టైర్లలో గాలి 1-2 పాయింట్లు తక్కువగానే ఉండేవిధంగా చూసుకోండి. ఈ రోజుల్లో మార్కెట్‌లో ఉన్న కార్ల టైర్లలో గాలికి బదులు నైట్రోజన్ నింపడం వల్ల కారు టైర్ కూల్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు కారు టైర్ ప్రెజర్‌ని చెక్ చేస్తూ ఉండాలి.

మీరు కారు టైర్ల జీవితాన్ని పొడిగించాలనుకుంటే వాటిని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. అంటే కారు టైర్లు ఒకే పరిమాణంలో ఉంటాయి. ప్రతి 5,000-6,000 కి.మీకి ముందు టైర్‌లను వెనుక అలాగే వెనుక టైర్‌లను ముందు భాగంలో అమర్చినట్లయితే టైర్లు ఎక్కువ కాలం వస్తాయి. వాస్తవానికి కారు ముందు టైర్లు వెనుక వాటి కంటే ఎక్కువ బరువును కలిగి ఉంటాయి. రెండు ముందు టైర్లను వెనుక భాగంలో అమర్చినప్పుడు కారు నాలుగు టైర్లు సమానంగా అరిగిపోతాయి. వాటి జీవితకాలం గణనీయంగా పెరుగుతుంది.

కారు టైర్ల జీవితాన్ని పొడిగించడానికి సరైన డ్రైవింగ్ చేయడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం తెలిసి లేదా తెలియక కారును ఇష్టమొచ్చిన విధంగా నడుపుతుంటాం. చాలా వేగంగా బ్రేకులు వేయడం వల్ల టైర్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అవి వేగంగా అరిగిపోతాయి. వేసవిలో టైర్లు, రహదారి రెండూ వేడిగా ఉంటాయి. కాబట్టి వేగంగా అరుగుతాయి. కాబట్టి కారు టైర్ల జీవితాన్ని పెంచాలనుకుంటే కారును సులభంగా సౌకర్యంగా నడపాలి. అప్పుడే చాలా కాలం మన్నికగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories