Viral Video: వానకు రోడ్డుపైకొచ్చి ఈత కొట్టిన పెద్ద పెద్ద చేపలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Fish Swim Through Flooded Streets as Pond Overflows in Rain-Hit Rajasthan; Video Goes Viral
x

Viral Video: వానకు రోడ్డుపైకొచ్చి ఈత కొట్టిన పెద్ద పెద్ద చేపలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Highlights

Viral Video: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను మేఘాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాలు ప్రవేశించి నెలన్నర దాటినా దక్షిణాదిన వర్షాలు మాత్రం దోబూచులాడుతున్నాయి.

Viral Video: దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను మేఘాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాలు ప్రవేశించి నెలన్నర దాటినా దక్షిణాదిన వర్షాలు మాత్రం దోబూచులాడుతున్నాయి. కానీ ఉత్తర భారతదేశం మాత్రం మాన్సూన్ ముంచెత్తుతోన్న వర్షాలతో అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తూ తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.

గత రెండు రోజులుగా కుండపోత వర్షాల వల్ల నాగౌర్ జిల్లాలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. నదులు, డ్రైనేజీలు, చెరువులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. భారీ వర్షాలకు లంపోలై అనే చెరువు నిండిపోవడంతో, అందులోని నీరు రోడ్డుపైకి వచ్చి పెద్ద పెద్ద చేపలు కూడా రోడ్లపైకి చేరాయి. వాటిని ఈతకొడుతూ చూస్తూ స్థానికులు ఆశ్చర్యపోయారు. కొందరు ఆ చేపల్ని పట్టుకోవడానికి రోడ్లపైకి దిగి వేట ప్రారంభించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయంలో, అజ్మీర్, బుండి, పాలి, పుష్కర్, సవాయి మాధోపూర్ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చాయి. నదులు, ఆనకట్టలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాల మధ్య రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి జోధ్‌పూర్-జైపూర్ హైవేలోని బనాద్ రోడ్డుపై భారీగా నీరు చేరింది. దాంతో వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ఇక వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం నుంచి వర్షపాతం కొంత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జూలై 27-28 తేదీల్లో తూర్పు రాజస్థాన్‌లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జైపూర్ వాతావరణ కేంద్ర డైరెక్టర్ రాధే శ్యామ్ శర్మ వెల్లడించారు.

ప్రస్తుతం ఈ వర్షాలు రైతులకు ఇబ్బందిగా మారినా, చేపల వేటకు ఊహించని అవకాశాన్ని అందించాయి. రోడ్లపై ఈతకొడుతున్న చేపలు చూసి ఆశ్చర్యపోతున్న ప్రజలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వినూత్న దృశ్యాలని సాక్షిగా ఉంచుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories