Optical Illusion: హలో బాస్.. ఈ ఫొటోలో ఓ నెంబర్ దాగుంది.. కనిపెడితే మీ ఐ పవర్ సూపరంతే..!

Photo Puzzle: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వైరల్ వీడియోలు, వైరల్ ఫొటోల సందడి కనిపిస్తోంది. వీటితోపాటే ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా నెటిజన్లను మాగా ఆకట్టుకుంటున్నాయి.

Arun Chilukuri
Published on: 24 April 2023 3:28 PM IST
Find the Hidden Number This Optical Illusion Photo Check Here
X

Optical Illusion: హలో బాస్.. ఈ ఫొటోలో ఓ నెంబర్ దాగుంది.. కనిపెడితే మీ ఐ పవర్ సూపరంతే..!

Number Hidden: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వైరల్ వీడియోలు, వైరల్ ఫొటోల సందడి కనిపిస్తోంది. వీటితోపాటే ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి అత్యంత క్లిష్టమైన ఫొటోలుగా పేరుగాంచాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ ఫొటోలో ఒక సంఖ్య దాగి ఉంది. దానిని మీరు కనుగొనాలి. ఈ సంఖ్యను కనుగొనడంలో చాలామంది విఫలమయ్యారు. మీరు కూడా ఓసారి ప్రయత్నించండి.

ఈ ఫొటోను డైలీ మెయిల్ షేర్ చేసింది. డైలీ మెయిల్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఈ ఫొటోను ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్ జాక్‌పాట్ జాయ్ రూపొందించింది. గోడపై వేలాడుతున్న దృశ్యంలా డిజైన్ చేశారు. దానిలో ఒక సంఖ్యను దాచి ఉంచారు.

పెయింటింగ్ సహాయంతో నంబర్ తయారు చేశారు. ఈ ఫొటోలో సంఖ్యను మీరు కనుగొంటే కచ్చితంగా మేధావే. అంతే కాదు ఇప్పటి వరకు 10 మంది మాత్రమే సరైన సమాధానం చెప్పారంటూ డైలీ మెయిల్ పేర్కొంది.

సరైన సమాధానం ఏంటంటే?

మీరు ఇంకా సమాధానం కనుగొనలేకపోతే, సరైన సమాధానం ఏమిటో మీరు తెలుసుకోవాలి. నిజానికి ఈ ఫొటోలో 20 అనే సంఖ్య దాగి ఉంది. మీరు జాగ్రత్తగా చూస్తే, దిగువన 20 అంటే 2, 0 సంఖ్యలు కనిపిస్తాయి. ఈ సంఖ్య కోసం మీరు మీ మనస్సుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. దిగువ సమాధానంలో ఎరుపు వృత్తాన్ని కూడా ఫోకస్ చేయండి.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story