Viral Video: పాము తేలును మింగడం ఎప్పుడైనా చూశారా.? వైరల్‌ వీడియో..

Viral Video: పాములు ఎలుకలను, కప్పలను మింగడం సర్వసాధారణమైన విషయం. అయితే అనకొండ లాంటి పెద్ద పెద్ద పాములను జంతువులను సైతం మింగడం తెలిసే ఉంటుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 Sept 2024 5:51 PM IST
Fight Between Snake and Scorpion Video Goes Viral in Social Media
X

Viral Video: పాము తేలును మింగడం ఎప్పుడైనా చూశారా.? వైరల్‌ వీడియో..

Viral Video: పాములు ఎలుకలను, కప్పలను మింగడం సర్వసాధారణమైన విషయం. అయితే అనకొండ లాంటి పెద్ద పెద్ద పాములను జంతువులను సైతం మింగడం తెలిసే ఉంటుంది. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. అయితే పాము తేలును మింగడం ఎప్పుడైనా చూశారా.? పాము, తేలును మింగడం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ! ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది కదూ! అయితే ఇది రియల్‌గా జరిగింది.

తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ కట్లపాము ఆహారం కోసం వెతికే పనిలో ఉంది. అంతలోనే దానికి ఒక తేలు కనిపించింది. దీంతో వెంటనే ఆ తేలను మింగేలాయని అనుకుంది. వెంటే తేలను నోటిలో పెట్టుకుని కరుచుకుంది. అయితే అసలు ట్విస్ట్‌ అక్కడే మొదలైంది. తేలును మింగే ప్రయత్నం అయితే చేసింది కానీ పాముకు అది సాధ్యం కాలేదు.

తేలులో కొంత భాగమే పాము నోట్లోకి పోయింది. కాళ్లతో పామును గట్టిగా పట్టేసింది తేలు. ముందు కాళ్లతో పామును గట్టిగా పొడించింది. అయితే తేలును వదలడానికి ఎంత ప్రయత్నించినా పాముకు అది సాధ్యం కాలేదు. అయితే ఆ వీడియో అంతటితో ముగిసింది. ఇంతకీ ఆ తర్వాత ఏం జరిగింది.? తేలు పామును వదిలిపెట్టిందా లేదా అన్నది మాత్రం తెలియలేదు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ వీడియో చూస్తేనే భయంగా ఉందంటూ కామెంట్స్‌ చేయగా మరికొందరు కచ్చితంగా తేలును వదిలేసి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. తేలుపై పాము దాడి చేసిన ఈ అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story