Viral Video: కొండచిలువ, నాగుపాముల మధ్య కొట్లాట..!

Viral Video: పాముల వీడియోలను నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తారు. పదే పదే చూస్తూ షేర్స్‌, లైక్స్‌, కామెంట్స్‌ చేస్తారు.

hmtv Digital Team
Updated on: 8 Nov 2021 6:46 PM IST
Fierce Battle Between Cobra and Python Viral Video
X

కొండాచిలువ మరియు నాగుపాము కొట్లాట (యూట్యూబ్ ఇమేజ్)

Viral Video: సోషల్ మీడియాలో జంతువుల కంటెంట్‌కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే జంతువుల వీడియోలు తొందరగా వైరల్‌ అవుతాయి. ఇందులో పాములు కూడా ఒకటి. పాముల వీడియోలను నెటిజన్లు ఆసక్తిగా తిలకిస్తారు. పదే పదే చూస్తూ షేర్స్‌, లైక్స్‌, కామెంట్స్‌ చేస్తారు. తాజాగా నాగుపాముకి, కొండచిలువకి మధ్య జరిగిన కొట్లాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియోను నెటిజన్లు చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తున్నారు.

ఈ వీడియోను వైరల్ ప్రెస్ తన యూట్యూబ్ ఖాతాలో షేర్ చేసింది. వీడియోలో నాగుపాము, కొండచిలువ మధ్య భీకర పోరుని మనం గమనించవచ్చు. సాధారణంగా ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములలో నాగుపాము ఒకటి. పాముల జాతులలో కొండచిలువ అతిపెద్దది అత్యంత శక్తివంతమైనది. ఈ రెండింటి కొట్లాట భీకర పోరుకి దారి తీసింది. అయితే అందరు కొండచిలువ పెద్దదిగా బలంగా ఉంటుంది. కాబట్టి నాగుపాముని చంపుతుందని అనుకుంటారు. కానీ ఇక్కడ రివర్స్‌ జరిగింది.

నాగుపాము కొండచిలువను చంపేసి మింగేస్తుంది. ఈ దృశ్యం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇది నేనే ఊహించలేని పరిణామం అన్నాడు. మరొకరు పాము నోరు అంత పెద్దదిగా ఉంటుందా అని ప్రశ్నించింది. ఇంకొకరు ఈ వీడియో చాలా భయకరంగా ఉందని చెప్పింది. ఇప్పటి వరకు ఈ వీడియోను యాభై వేలకు పైగా తిలకించారు. మీరు కూడా వీడియో చూసి మీ స్పందనను తెలియజేయండి.


hmtv Digital Team

hmtv Digital Team

Next Story