Viral Video: పట్టాల మీద పడిపోయిన కూతురి కోసం తండ్రి సాహసం.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..!

Father Saves Daughter Running Train Incident
x

Viral Video: పట్టాల మీద పడిపోయిన కూతురి కోసం తండ్రి సాహసం.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..!

Highlights

Viral Video: రైల్వే స్టేషన్లలో రన్నింగ్ ట్రైన్ ఎక్కడం లేదా దిగి వెళ్లడం చాలా మంది తప్పుడు అలవాట్లలో ఒకటి.

Viral Video: రైల్వే స్టేషన్లలో రన్నింగ్ ట్రైన్ ఎక్కడం లేదా దిగి వెళ్లడం చాలా మంది తప్పుడు అలవాట్లలో ఒకటి. రైల్వే అధికారులు ఎన్ని సార్లు హెచ్చరించినా, చాలా మంది ప్రయాణికులు అలాంటి ప్రమాదకర చర్యలకు పాల్పడుతూనే ఉంటున్నారు. ఇలా మనక్షణములో తప్పిన ఓ ప్రమాద ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఒక యువతి స్టేషన్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరొక ప్లాట్‌ఫామ్ మీదికి వెళ్లేందుకు ట్రైన్ పట్టాలు దాటేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అటువైపు వేగంగా ట్రైన్ వస్తోంది. ట్రైన్ అతి దగ్గరకు వచ్చేసరికి షాక్‌కు గురైన ఆ యువతి పట్టాలు, ప్లాట్‌ఫామ్ మధ్యలో కదలకుండా నిలబడిపోయింది.

ఈ పరిస్థితిని గమనించిన ఆమె తండ్రి ఒక్క సెకను కూడా ఆలోచించకుండా వెంటనే పట్టాల మీదకు దూకి, తన కూతురిని గట్టిగా పక్కకు తీయడంతో ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ట్రైన్ కూడా వాళ్లను తాకకుండా దూసుకుపోయింది.

ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్నవారు వీడియో తీసారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తండ్రి చూపిన ప్రేమ, సాహసాన్ని చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. అయితే మరోవైపు — రన్నింగ్ ట్రైన్ సమీపంలో ఇలా ప్రాణాలతో చెలగాటం అవసరమా అంటూ పలువురు మండిపడుతున్నారు.

రైల్వే అధికారులు కూడా ప్రయాణికులకు మరోసారి హెచ్చరిక చేశారు. రన్నింగ్ ట్రైన్ ఎక్కడం, దిగడం, పట్టాలు దాటడం ఎంత ప్రమాదకరమో గుర్తుంచుకోవాలని, అలాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories