Eye Test: మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలని ఉందా.? ఈ ఫొటోలో మొదట ఏం కనిపిస్తోందో చెప్పండి

Eye Test: మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలని ఉందా.? ఈ ఫొటోలో మొదట ఏం కనిపిస్తోందో చెప్పండి

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 July 2024 5:27 PM IST
Whats you see first in this photo can reveals what is your charecter
X

Eye Test: మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలని ఉందా.? ఈ ఫొటోలో మొదట ఏం కనిపిస్తోందో చెప్పండి

Eye Test: మనం ఈ ప్రపంచాన్ని చూసే విధానంపైనే మన ఆలోచనలు, మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఒక విషయాన్ని ఏ ఇద్దరు ఒకలా ఆలోంచించరు, అలాగే ఒక దృశ్యాన్ని ఏ ఇద్దరు ఒకలా చూడరు. దీనిబట్టే మనం ఎలాంటి వాళ్లం, మన ఆలోచన ఎలా ఉంటుంది.? అన్న విషయాలను అంచనా వేస్తుంటారు.

కొన్ని రకాల ఫొటోలను చూపించి వాటి ఆధారంగా మన మానసిక స్థితిని అంచనా వేస్తుంటారు. అయితే ఒకప్పుడు కేవలం మానసిక నిపుణులకు మాత్రమే వీటి గురించి తెలిసేవి. కానీ సోషల్‌ మీడియాలో అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటిపై ప్రతీ ఒక్కరికీ అవగాహన వస్తోంది. పర్సనాలిటీ టెస్ట్‌లకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అలాంటి ఫొటోనే ఒకటి ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే మొదట మీకు ఏం కనిపిస్తుందో దాని ఆధారంగా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. నిజానికి ఈ ఫొటో చూస్తే రెండు ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. వీటిలో ఒకటి వైన్‌ గ్లాస్‌ కాగా, మరొకటి రెండు ఫోర్క్‌లు. ఫోర్క్‌లు అచ్చగా వైన్‌ గ్లాస్‌ ఆకారంలో ఉండడంతో గ్లాస్‌ అనే భ్రమ కలుగుతోంది. అయితే ఈ రెండింటిలో మనకు మొదల ఏం కనిపిస్తుందో దాని బట్టి మనం ఎలాంటి వాళ్లమో చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు.

ఒకవేళ మీకు ఈ పొటో చూడగానే.. మొదటగా వైన్‌ గ్లాస్‌ కనిపిస్తే మీరు చేసే ప్రతీ పనిని చాలా శ్రద్దతో చేస్తారని అర్థం. చేసే పనిలో పర్‌ఫెక్షన్‌ ఉండేలా చూసుకుంటారని అర్థం. అంతేకాకుండా మీరు చాలా మందిని ఆకర్షిస్తారు. మీ మాటలకు, మీరు చేసే పనులకు ఇతరులు ఆకర్షితులవుతుంటారు. అదే మీకు మొదట ఫోర్క్‌లు కనిపిస్తే.. మీరు చాలా ధృడమైన ఆలోచనలను ఉన్న వ్యక్తులని అర్థం. ఇతరులెవరు ఆలోచించని విధానంలో మీరు ఆలోచిస్తుంటారు. కొత్త పనులు ఎలాంటి జంకు లేకుండా మొదలు పెడుతుంటారు. నష్టం జరుగుతుందో, ఫెయిల్‌ అవుతామో అన్న భయం ఉండదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story