Extreme Drop in Oxygen story: చివరకు మట్టిమశానమే మిగులుతుంది.. సైంటిస్టుల షాకింగ్ ప్రకటన!

Extreme Drop in Oxygen story
x

Extreme Drop in Oxygen story: చివరకు మట్టిమశానమే మిగులుతుంది.. సైంటిస్టుల షాకింగ్ ప్రకటన!

Highlights

Extreme Drop in Oxygen story: ఒకప్పుడు జీవానికి ఊపిరిచ్చిన ఈ గాలి... ఇప్పుడు మనకి దూరంకానుందా? పచ్చని చెట్లు శాశ్వతంగా ఏండిపోనున్నాయా? మనం బతుకుతున్న ఈ నీలి గ్రహం... మళ్ళీ కోట్ల సంవత్సరాలు వెనక్కి పోతుందా? అవును... మనకు కనబడని వేళల్లో, భూమి తన ప్రాణాలను వెనక్కి లాక్కుంటుందట.

Extreme Drop in Oxygen story: ఒకప్పుడు జీవానికి ఊపిరిచ్చిన ఈ గాలి... ఇప్పుడు మనకి దూరంకానుందా? పచ్చని చెట్లు శాశ్వతంగా ఏండిపోనున్నాయా? మనం బతుకుతున్న ఈ నీలి గ్రహం... మళ్ళీ కోట్ల సంవత్సరాలు వెనక్కి పోతుందా? అవును... మనకు కనబడని వేళల్లో, భూమి తన ప్రాణాలను వెనక్కి లాక్కుంటుందట. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారబోతోందట. మనం బతికేందుకు అవసరమైన ఆ జీవవాయువు... దాని మార్గాన్ని మరిచిపోతుందట. ఇది ఎవరూ ఊహించని నిజం. శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ మాటలు మన మనస్సును కొల్లగొడుతున్నాయి. ఇంతకీ... అసలేం జరగనుంది? మన శ్వాస ఆగిపోనుందా? అసలు సైంటిస్టులు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.

సైంటిస్టుల షాకింగ్ ప్రకటన!

శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన భయాన్ని రేపుతోంది. భవిష్యత్తులో భూమి వాతావరణం పూర్తిగా మారబోతోందో స్పష్టమైంది. ఇప్పుడు మనం ఊపిరి తీసుకోవడానికి ఆధారపడే ఆక్సిజన్ స్థాయిలు, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోతాయట. ఈ మార్పు మెల్లగా కాదు... సడన్‌గా జరుగుతుందట. మన గ్రహం మళ్ళీ కోట్ల ఏళ్ల క్రితం నాటి పరిస్థితికి వెళ్లిపోతుందని సైంటిస్టులు బాంబు పేల్చారు. అంటే ఆర్కియాన్ కాలం నాటికి భూమి వెళ్తుందన్నది సైంటిస్టుల మాట. నాటి కాలంలో ఆక్సిజన్ తక్కువగా ఉండేది. జీవానికి అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితులు ఉండేవి. అప్పట్లో గాలిలో మీథేన్ ఎక్కువగా ఉండేది. కొన్నాళ్లకు మళ్ళీ అలాంటి వాతావరణమే ఏర్పడే అవకాశాలున్నాయి. భూమి మీద జీవవాయువు శాశ్వతం కాదు. భూమిపై కార్బన్-డై-ఆక్సైడ్ స్థాయిలను గమనిస్తూ పరిశోధకులు 4 లక్షలకి పైగా మోడల్స్‌ని ఉపయోగించి ఓ భయానక నిజాన్ని వెలికితీశారు. భవిష్యత్తులో సూర్యుడు మరింత వేడిగా మారుతాడు. దీంతో పచ్చని మొక్కలు జీవించలేవు. మొక్కలు జీవించకపోతే, ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీని కారణంగా మనం ఊపిరి తీసుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ భూమి మీద ఉండదు. ఈ పరిణామం సముద్రాలు ఆవిరైపోయే దశకు ముందు సంభవిస్తుంది. అంటే.. నీరు పోయే లోపే, జీవితం చనిపోతుందన్న మాట. శ్వాసించే జీవులు... మన లాంటి మనుషులు... దాదాపు అంతా అంతమవుతారు. భూమి మీద ఆక్సిజన్ లేకుండా బతికే జీవులు మాత్రమే మిగులుతాయి. భూమి మీద జీవవాయువు పరిపూర్ణంగా ఉండే సమయం.. ఈ గ్రహం మొత్తం జీవితకాలంలో కేవలం 20 నుంచి 30 శాతం మాత్రమే. అలాంటి వాతావరణంలో ఓజోన్ లేయర్ ఉండదు. మీథేన్ ఎక్కువగా ఉంటుంది. జీవం బతికేందుకు సాధ్యపడని స్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం భూమి కథ మాత్రమే కాదు.. మనం ఇతర గ్రహాలలో జీవం కోసం వెతికేటప్పుడు కూడా ఈ నిజాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.

భూమి మనల్ని వదిలేస్తుందా?

ఇక మొత్తంగా చూస్తే ఓ విషయం మాత్రం అర్థమవుతుంది. భూమి చివరి శ్వాస తీసుకునే దశ దగ్గరపడుతోంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేరు. కానీ శాస్త్రవేత్తలు ఊహించిన దృశ్యం మాత్రం.. ఆలోచించిన కొద్దీ గుండెల్లో పిడుగులా పడుతుంది. ఆ రోజున భూమి మీద పచ్చని చెట్లు ఉండవు. ఆకాశంలో ఎగిరే పక్షులు ఉండవు. సముద్రాల్లో ఈదే చేపలతో పాటు జీవం కదలాడే ప్రతి రూపం మాయమైపోయి ఉంటుంది. భూమి మీద వెలుతురు ఉన్నా, జీవానికి ఆసరా ఉండదు. కొన్నేళ్ళ పాటు పోరాడిన జీవాలు ఒక్కొక్కటిగా ప్రాణాలు కోల్పోతాయి. మొదట పెద్ద జంతువులు, వాటి వెంట చిన్న జీవులు, ఆ తర్వాత పక్షులు, చివరగా చెట్లు కూడా ఒక్కొక్కటిగా తమ జీవితాన్ని ముగించుకుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే గాలి కదులుతుంది కానీ అది మన ఊపిరిని నింపే గాలి కాదు. అది ఒక చల్లని మరణ శ్వాస. ఇది కేవలం భవిష్యత్తు ఊహ కాదు.. ఇది జరగనున్న నిజం. ఏదో ఒక రోజు ఈ నీలి గ్రహం మనందరినీ వీడుతుంది. మనం భూమిని విడిచి వెళ్లకముందే.. భూమి మనల్ని వదిలేస్తుంది...!

Show Full Article
Print Article
Next Story
More Stories