Viral Video: ఈ చేప మాంసాన్ని చూసి అందరు షాక్ అవుతున్నారు..! ఎందుకో తెలుసా..

Viral Video: తాజాగా ఓ చేపకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

hmtv Digital Team
Updated on: 12 Nov 2021 3:00 PM IST
Everyone is Shocked to See This Fish Meat Viral Video
X
బ్లూ మాంసం కలిగిన చాప (ఫోటో ఇన్‌స్టాగ్రామ్)

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కామెడీ, ఫన్నీ, డేంజర్ వీడియోలు కూడా ఉంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలను చాలా ఎంజాయ్‌ చేస్తారు. తాజాగా ఓ చేపకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన యూజర్లు నోరెళ్ల బెడుతున్నారు. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా చూడలేదే అన్నట్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకోవాలని ఉందా అయితే చూడండి.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి కత్తితో చేపను కోయడం మనం గమనించవచ్చు. అయితే ఆశ్చర్యకరంగా ఆ చేప మాంసం నీలం రంగులో ఉంటుంది. సాధారణంగా చేప మాంసం ఎరుపు రంగులో ఉంటుందని తెలుసు కానీ ఇలా నీలం రంగులో ఉండే చేప మాంసాన్ని చూసి అందరు షాక్ అవుతున్నారు. అయితే ఈ చేప పేరు లింగ్‌కోడ్. దీనిని బఫెలో కాడ్ అని కూడా అంటారు. ఇది ఎలోంగటస్ జాతికి చెందిన హెక్సాగ్రామిడే కుటుంబానికి చెందినది. ఈ జాతికి చెందిన చేపల మాంసం ఇలా నీలం రంగులో ఉంటుందట. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఒక రోజు క్రితం షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 16వేలకు మందికి పైగా చూశారు. వందలకు పైగా లైక్స్‌, కామెంట్స్‌ వచ్చాయి. బ్లూ మీట్ ఫిష్ వీడియో చూసి నెటిజన్లు కొందరు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా ప్రశ్నించాడు. ఇది నీలం రంగులో ఎందుకు ఉంది? అదే సమయంలో మరొక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ, 'ఇది అద్భుతంగా ఉందని తన జీవితంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. మీరు కూడా ఈ వీడియోను చేసి మీ స్పందనను తెలియజేయండి.


hmtv Digital Team

hmtv Digital Team

Next Story