Auspicious Things: మీ కలలో ఈ 6 కనిపిస్తున్నాయా.. అయితే, మీ దశ తిరిగినట్లే.. అవేంటో తెలుసా?

Swapna Shastra: నిద్రలో మనం చూసే దృశ్యాలనే కలలు అంటుంటారు. అవి మన గురించి లేదా మన జీవితంలో మనం చేసే దేనికైనా సంబంధించినవి కావచ్చు లేదా కాకపోవచ్చు.

Jyothi
Published on: 17 July 2023 10:26 AM IST
Do you see these 6 Auspicious Things in your Dream Signs of Good Luck
X

Auspicious Things: మీ కలలో ఈ 6 కనిపిస్తున్నాయా.. అయితే, మీ దశ తిరిగినట్లే.. అవేంటో తెలుసా?

Swapna Shastra: నిద్రలో మనం చూసే దృశ్యాలనే కలలు అంటుంటారు. అవి మన గురించి లేదా మన జీవితంలో మనం చేసే దేనికైనా సంబంధించినవి కావచ్చు లేదా కాకపోవచ్చు. అంతేకాకుండా వ్యక్తులు గతి రాత్రి చూసిన కలను గుర్తుపెట్టుకోకపోవచ్చు లేదా గుర్తుంచుకోకపోవచ్చు. కొన్ని కలలు వింతగా కనిపిస్తాయి. కొన్ని కలలు విచిత్రంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ అవి భవిష్యత్తులో జరిగే సంఘటనల సూచికలుగా చెబుంతుంటారు. కాబట్టి ఎలాంటి కలలు అదృష్షాన్ని ఇస్తాయి, ఎవి దురదృష్షాన్నిఇస్తాయో తెలుసుకోవాలి. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో కొన్ని ప్రత్యేకతలు కనిపించడం శుభప్రదంగా ఉంటుందని చెబుతుంటారు. ఇలాంటి కలలు ఒక వ్యక్తికి మంచి రోజుల రాకను సూచిస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో ఏ విషయాలు కనిపించడం శుభప్రదంగా పరిగణిస్తుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు కలలో గుర్రపు స్వారీ చేయడాన్ని చూడటం శుభ సంకేతం. ఉద్యోగం-వ్యాపారంలో మీరు పెద్ద పురోగతిని పొందబోతున్నారని దీని అర్థం.

మీ కలలో అద్దంలో మీ ముఖాన్ని చూసుకోవడం మీకు కనిపిస్తుందా.. అది మీ వైవాహిక జీవితంలో ఆనందానికి సంకేతంగా పేర్కొంటారు.

కలలో జుట్టు కత్తిరించినట్లు కనిపిస్తే.. ప్రణాళికలు పూర్తి కావడానికి సంకేతంగా చెబుతున్నారు. గోళ్లు కత్తిరించడం లాంటివి కనిపిస్తే అప్పుల నుంచి ఉపశమనం పొందటానికి సంకేతంగా చెబుతుంటారు.

కలలో వర్షం చూడటం అంటే పాత పెట్టుబడిపై లాభం పొందడం అన్నమాట. ఈ ప్రయోజనం డబ్బు లేదా ఆస్తి రూపంలో పొందవచ్చని చెబుతున్నారు.

కలలో ఏనుగు స్వారీ చేయడాన్ని మీరు చూస్తే.. పురోగతికి సంకేతంగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా మీరు తెల్ల ఏనుగును చూసినట్లయితే అది గొప్ప విజయానికి సూచికగా చెబుతున్నారు.

కలలో చల్లదనం, శాంతిని సూచించే చంద్రుడిని చూడటం కూడా శుభప్రదం. అంటే అతి త్వరలో మీ గౌరవం పెరుగుతుందన్నమాట.

Jyothi

Jyothi

Next Story