Train: రైలు కోచ్‌లపై 5 అంకెల నంబర్‌లను గమనించారా.. ఇందులో ట్రైన్ పూర్తి జాతకం దాగి ఉందండోయ్..!

Do You Know the Meaning of 5 Digit Number on Train Coach Check Interesting Facts of Indian Railways
x

Train: రైలు కోచ్‌లపై 5 అంకెల నంబర్‌లను గమనించారా.. ఇందులో ట్రైన్ పూర్తి జాతకం దాగి ఉందండోయ్..!

Highlights

Indian Railways: భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మీరు కూడా ఏదో ఒక సమయంలో రైలులో ప్రయాణించి ఉంటారు. అయితే రైలులోని ప్రతి కంపార్ట్‌మెంట్‌పై రైల్వే శాఖ 5 అంకెల నంబర్‌ను రాసి ఉంచడం మీరు ఎప్పుడైనా గమనించారా.

Indian Railways: భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మీరు కూడా ఏదో ఒక సమయంలో రైలులో ప్రయాణించి ఉంటారు. అయితే రైలులోని ప్రతి కంపార్ట్‌మెంట్‌పై రైల్వే శాఖ 5 అంకెల నంబర్‌ను రాసి ఉంచడం మీరు ఎప్పుడైనా గమనించారా. ఇవి యాదృచ్ఛికంగా రాసిన సంఖ్యలు కావు. వాటికి ప్రత్యేక అర్ధం ఉంది. ఈ నంబర్ల అర్థం మీకు తెలిస్తే, మీరు మీ రైలు కంపార్ట్‌మెంట్ గురించి చాలా సమాచారాన్ని పొందవచ్చు. రైలులోని ఈ ఐదు అంకెల నంబర్‌లో రైల్వే ఏ సమాచారాన్ని దాచిపెట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం..

రైలులోని ప్రతి బోగీ వెలుపల రాసిన ఈ ఐదు నంబర్లలో (ట్రైన్ కోచ్ నంబర్) ఈ బోగీని ఎప్పుడు నిర్మించారు మరియు ఇది ఏ రకమైన బోగీ అనే సమాచారం ఉంది. ఇందులో మొదటి రెండు అంకెలు ఈ రైలు బోగీ ఎప్పుడు నిర్మించారో తెలియజేస్తాయి. చివరి మూడు అంకెలు దాని వర్గాన్ని తెలియజేస్తాయి.

మొదటి రెండు అంకెల అర్థం..

రైలు బోగీపై 05497 నంబర్ రాసి ఉందనుకుందాం. కాబట్టి దీన్ని రెండు భాగాలుగా విభజించి చదవాలి. మొదటి రెండు అంకెల నుంచి మనం దాన్ని తయారు చేసిన సంవత్సరం తెలుసుకుంటాం. అంటె ఈ బోగీని 2005లో తయారు చేశారన్నమాట. అదే బోగీపై 98397 అని రాసి ఉంటే 1998లో ఆ బోగీ తయారైందని గుర్తించాలి.

చివరి మూడు అంకెల అర్థం..

కాగా బోగీపై రాసిన చివరి మూడు అంకెలు ఆ బోగీ వర్గాన్ని తెలియజేస్తాయి. మొదటి సందర్భంలో వలె (05497) ఈ బోగీ జనరల్ కేటగిరీ, రెండవ సందర్భంలో (98397) బోగీ స్లీపర్ క్లాస్‌కు చెందినది తెలియజేస్తుంది. మీరు దానిని వివరంగా అర్థం చేసుకోవడానికి క్రింది చార్ట్‌ని చూడొచ్చు.

001-025 : ఏసీ ఫస్ట్ క్లాస్

026-050 : కాంపోజిట్ 1AC + AC-2T

051-100 : AC-2T

101-150 : AC-3T

151-200 : CC (AC చైర్ కార్)

201-400 : SL (2వ తరగతి Sleeper)

401-600 : GS (జనరల్ 2వ తరగతి)

601-700 : 2S (2వ తరగతి సిట్టింగ్/జన శతాబ్ది చైర్ క్లాస్)

701-800 : సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్

801 + : ప్యాంట్రీ కార్, జనరేటర్ లేదా మెయిల్

సో, మీ తదుపరి రైలు ప్రయాణంలో మీ బోగీ వెలుపల రాసిన నంబర్‌ను చూసి, ఈ బోగీ ఎప్పుడు తయారు చేశారో, అది ఏ తరగతికి చెందినదో సులభంగా తెలుసుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories