Airplane Windows: విమానం కిటికీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

Do You Know Hole on Airplane Windows Check Here is the Reason
x

Airplane Windows: విమానం కిటికీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

Highlights

Airplane Windows Hole: ప్రస్తుతం విమానంలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు విమాన రాకపోకలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు చాలా మంది విమాన ప్రయాణాన్ని మాత్రమే ఇష్టపడుతున్నారు.

Airplane Windows Hole: ప్రస్తుతం విమానంలో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు విమాన రాకపోకలు తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు చాలా మంది విమాన ప్రయాణాన్ని మాత్రమే ఇష్టపడుతున్నారు. దీనికి అతి పెద్ద కారణం తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడమే. ఇటువంటి పరిస్థితిలో, ప్రయాణీకులు తమ విమానానికి సంబంధించిన చిన్న సమాచారాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. విమానానికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

వాణిజ్య విమానాల కిటికీలకు చిన్న రంధ్రం ఉంటుంది. మీరు దీన్ని గమనించే ఉంటారు. ఒకవేళ గమనిస్తే.. అంది ఎందుకు ఉందనే విషయం తెలుసా? అయితే, ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రంధ్రాన్ని "బ్లీడ్ హోల్" అంటారు. దీనిని "బ్లీడ్ హోల్" అని ఎందుకు పిలుస్తారు, దాని పని ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇది మంచి కారణం కోసం విమానాల కిటికీలలో నిర్మించారు. విండోలో ఉండే ఈ చిన్న రంధ్రాన్ని 'బ్లీడ్ హోల్' అంటారు. క్యాబిన్ లోపల నుంచి విమానం కిటికీలపై ఉండే ఒత్తిడిని నియంత్రించడంలో ఈ రంధ్రం సహాయపడుతుంది.

విమానం కిటికీ పగులుతుందా..

ప్రయాణీకులను రక్షించే క్రమంలో విండో వెలుపల ఉన్న పొరను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా కిటికీ బయటి గ్లాస్ మొదట పగిలిపోతుంది. విండో గ్లాస్ బయటి, మధ్య, లోపలి పొరలతో కూడి ఉంటుంది. ఇవి సాధారణంగా యాక్రిలిక్‌తో తయారు చేస్తారు.

క్యాబిన్ పీడనం కలిగించే ఒత్తిళ్లను బయటి పొర భరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లోపలి పొర "అత్యంత అరుదైన" ఈవెంట్‌లో క్యాబిన్ ఒత్తిడిని నిర్వహించడానికి రూపొందిస్తారు. అందువల్ల ప్రయాణీకులు ఈ రంధ్రం వంటి చిన్న బుడగపై తల పెట్టకూడదని సిఫార్సు చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా, ఈ రంధ్రం చేయాల్సిన పని సక్రమంగా చేయదని చెబుతుంటారు.

ఈ చిన్న రంధ్రం ఫ్లైట్ సమయంలో క్యాబిన్ ప్రెజర్ బయటి పొరకు మాత్రమే వర్తిస్తుందని నిర్ధారిస్తుంది. తద్వారా అత్యవసర పరిస్థితుల కోసం మధ్య పొరను భద్రపరుస్తుంది. మూడు అద్దాలు రంధ్రాలు లేకుండా సీలు చేస్తే, లోపలి పొరపై క్యాబిన్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ఇటువంటి పరిస్థితిలో, కిటికీని మీ నిద్రకు ఆసరాగా ఉపయోగించకూడదని గాలిలో ప్రయాణించేటప్పుడు మీరు ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలి. సాంకేతికంగా మీ పక్కన కూర్చున్న ప్రయాణికుడి భుజంపై తల పెట్టడం.. మీకు సురక్షితం. అయితే ఇలా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది. మీ తల కోసం సీటుపై ఇచ్చిన స్థలాన్ని ఉపయోగించుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories