Dreams: మీకు కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే ధనవంతులైనట్లే..!

Dreams: స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.

Arun Chilukuri
Updated on: 20 Jun 2022 8:00 PM IST
Do These Appear in a Dream but as if They Were Rich Good Luck Wealth Success
X

Dreams: మీకు కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే ధనవంతులైనట్లే..!

Dreams: స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కలలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఇవి వ్యక్తిగత జీవితంలో జరిగే శుభ సంఘటనలను సూచిస్తాయి. వీటి ప్రకరాం ఒక వ్యక్తి ధనవంతుడు కావొచ్చు. అపారమైన సంపదను పొందవచ్చు. అయితే కలలో ఏమి కనిపిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కలలో లక్ష్మీ దేవిని చూడటం: మీరు కలలో లక్ష్మీ దేవిని చూస్తే జీవితంలో చాలా డబ్బు సంపాదిస్తారని అర్థం.

కలలో తెల్ల ఏనుగు కనిపించడం: కలలో తెల్ల ఏనుగు లేదా తెల్ల పాము కనిపించడం వల్ల రాత్రిపూట ధనవంతుడు అవుతారని చెబుతారు. ఇలాంటి కల చాలా అదృష్టవంతులకు మాత్రమే వస్తుందని స్వప్నశాస్త్రం చెబుతోంది.

కలలో ప్రకాశవంతమైన సూర్యకాంతిని చూడటం: కలలో సూర్యకాంతి కనిపించడం శుభ స్వప్నంగా భావిస్తారు. మీ జీవితంలో త్వరలో కొత్త మార్పులు జరగబోతున్నాయని అర్థం. ఇవి ముఖ్యంగా ఉద్యోగ-వ్యాపారానికి సంబంధించిన సానుకూల మార్పులు.

కలలో ఎగరడం: కలలో మీరు ఎగురుతున్నట్లు లేదా విమానంలో ప్రయాణిస్తున్నట్లు అనిపిస్తే రాబోయే సమయం చాలా బాగుంటుందని అర్థం. మీరు మీ కెరీర్‌లో సులభంగా గొప్ప విజయాలు సాధిస్తారు. మీ పనులన్నీ విజయవంతమవుతాయి. మీకు చాలా డబ్బు వస్తుందని అర్థం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story