Viral Video: ఇప్పటికీ తగ్గని పుష్ప మేనియా.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో

Viral Video
x

Viral Video: ఇప్పటికీ తగ్గని పుష్ప మేనియా.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో

Highlights

Viral Video: పుష్ప సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు పార్టులుగా వ‌చ్చిన ఈ సినిమా రెండు భాగాలు భారీ విజ‌యాన్నినమోదు చేసుకున్నాయి. ఇక 2024లో వ‌చ్చిన పుష్ప‌2 నేష‌న‌ల్ వైడ్‌గా సంచ‌ల‌నం సృష్టించింది.

భారీ క‌లెక్ష‌న్ల‌తో ఇండియ‌న్ మూవీస్‌లో హైయ్య‌స్స్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచిందీ మూవీ. ఇక ఈ సినిమాలోని పాటలు సైతం అదే స్థాయిలో హిట్ అయ్యాయి. పుష్ప‌2లోని పీలింగ్స్ పాట‌కు యువ‌త బాగా అట్రాక్ట్ అయ్యారు. ర‌ష్మిక‌, అల్లు అర్జున్‌ల కెమెస్ట్రీ పాట‌కే హైల‌ట్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ పాట‌కు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఒక స్నేహితుల బృందం పుష్ప 2 సినిమాలోని ‘పీలింగ్స్’ పాటకు చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 2.8 కోట్ల మందికిపైగా చూశారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు, "ఇది సినిమాల అవార్డ్ షోలా ఉంది", "ఇంతసార్లు చూశానో తెలియదు", "నా సంగీత్ కూడా ఇలాగే నిర్వ‌హిస్తాష అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ పెళ్లి వేడుక‌లో కొంద‌రు స్నేహితుల గ్యాంగ్ పాట‌కు స్టెప్పులు వేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఓం తార్ఫే పోస్టు చేశారు. మ‌రెందుకు ఆల‌స్యం ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories