Viral Video: న‌దిలో ఈత కొడుతున్న వ్య‌క్తిపై మొస‌లి దాడి..

Crocodile Attack on a man Swimming in the River
x

ముసలి నుండి తప్పించుకున్న యువకుడు (ట్విట్టర్ ఇమేజ్)

Highlights

Viral Video: తాజాగా ఒక‌ భయానక వీడియో వైరల్ అవుతోంది. నదిలో ఓ వ్యక్తిపై మొస‌లి దాడి

Viral Video: సోష‌ల్ మీడియాలో ప్ర‌తిరోజు చాలా వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అందులో కొన్నికామెడీ వీడియోలు ఉంటే మ‌రొకొన్ని భ‌యంక‌ర వీడియోలు ఉంటాయి. నెటిజ‌న్లు వీటిని చూసి లైక్స్‌, కామెంట్స్ చేస్తారు. తాజాగా ఒక‌

భయానక వీడియో వైరల్ అవుతోంది. నదిలో ఓ వ్యక్తిపై మొస‌లి దాడి చేస్తుంది. ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ వ్య‌క్తి చాలా ప్ర‌య‌త్నిస్తాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

వీడియోలో ఒక వ్య‌క్తి న‌దిలో ఈత‌కొట్ట‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే అత‌డిని దూరం నుంచి ఒక మొస‌లి చూసి అత‌డి ద‌గ్గ‌ర‌కు వేగంగా దూసుకొస్తుంది. దానిని గ‌మ‌నించిన ఆ వ్య‌క్తి వేగంగా స్విమ్ చేస్తూ ఒడ్డుకు రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. కానీ కుద‌రదు ఇంత‌లో మొస‌లి అత‌డి చేతిని ప‌ట్టుకొని క‌రిచేస్తుంది. అయినా కానీ ఆ వ్య‌క్తి అలాగే ఈత‌కొట్టుకుంటూ ఎలాగోలా ఒడ్డుకు చేరుకోవ‌డం మ‌నం వీడియోలో చూడ‌వ‌చ్చు. అయితే ఆ వ్య‌క్తి ఒడ్డుకు చేరుకున్న త‌ర్వాత అత‌డి చేతి మొత్తం ర‌క్తంతో త‌డిసిపోతుంది. తర్వాత మొబైల్ ఎమర్జెన్సీ కేర్ సర్వీస్‌కు కాల్ చేశారు. అదృష్టవశాత్తూ, స్విమ్మర్‌కు ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజ‌న్లు చాలా ఉత్కంఠ‌గా వీడియో చూస్తున్నారు. బ్రెజిల్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

ఈ వీడియోను చిత్రీకరించిన వ్యక్తి మాట్లాడుతూ 'అకస్మాత్తుగా ప్రమాదకరమైన మొసలి అతనిని వెంబడించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అతను పారిపోవడానికి తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఎలాగో మొసలి అతనిని చేరుకోగలిగింది అత‌డి చేతిపై దాడి చేసింద‌ని' చెప్పాడు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు షాక్‌కి గుర‌వుతున్నారు. ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వీడియో చాలామంది చూశారు. ఆ వ్య‌క్తి అదృష్ట‌వంతుడ‌ని చాలామంది కామెంట్ చేశారు. వీడియో చూసి మీరు ఏమ‌నుకుంటున్నారో చెప్పండి.


Show Full Article
Print Article
Next Story
More Stories