Coronavirus: కళ్ళద్దాలతో కరోనా?

Coronavirus: కళ్ళద్దాలతో కరోనా?
x
Highlights

Coronavirus: కళ్ళజోడుతో కరోనా వ్యాప్తి చెందే అవకాశాలున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనడానికి ఇప్పటికీ పూర్తి విషయాలు తెలియవు. ఇప్పటివరకూ తెలిసిన వాటితో పాటు దాదాపుగా ఇంకా కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వ్యాప్తి విషయంలో మన దేశం ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది. ఒక పక్క దేశం అంతా పూర్తిగా అన్లాక్ మూడ్ లో ఉంది. ప్రజలకు కరోనా ఎలా సోకుతుంది అనే దానిపై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఇప్పటివరకూ తెలిసిన విధానాలను ఫాలో అవుతున్నప్పటికీ రోజు రోజు వస్తున్నా కొత్త అప్ డేట్ లతో గందరగోళంలో పడుతున్నారు.

కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఏ రూపంలో కరోనా సోకుతుందో తెలియక చాలా మంది భయపడిపోతున్నారు. అయితే ముఖ్యంగా కరోనా బారిన పడకుండా ఉండాలంటే తరచూ చేతులు కడుక్కోవడం, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం, శానిటైజర్ చేసుకోవడం వంటివి తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు.

తాజాగా కళ్ళజోడు తోనూ కరోనా ముప్పు ఎక్కువే అని తెలుస్తోంది. పముఖ కంటి వైద్యులు చెబుతున్న దాని ప్రకారం.. కళ్ళజోడుతో కరోనా వ్యాప్తి చెందుతుందట. అవును నిజమే కదా..మామూలుగా చూసినా కళ్ళజోడు ముక్కుకు దగ్గరగా ఉంటుంది కదా. మరి దానితో కరోనా వ్యాప్తి చెందడం సహజమే. అయితే, ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. కరోనా కళ్ళజోడు మీద కనీసం 9 గంటలు యాక్టివ్ గా ఉంటుందని చెబుతున్నారు. ఇది కొంచెం జాగ్రత్త పడాల్సిన అంశమే.

కళ్ళజోడు బయటకు వెళ్ళివచ్చిన తరువాత తీసి పక్కన పెట్టి.. తప్పనిసరిగా శుభ్రం చేసిన తరువాతే ఉపయోగించాలి. చేతులకు శానిటైజర్ రాసుకుని కళ్ళజోడును శుభ్రపరుచుకుని తిరిగి శానిటైజ్ చేసుకోవాలి. కళ్ళజోడును మాత్రం శానిటైజర్ తో శుభ్రపరుచకూడదని డాక్టర్లు చెబుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని ప్యోగించి కళ్ళజోడు శుభ్రం చేసుకోవాలని వారంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories