అప్పుడైనా పెళ్లిళ్లు జరుగుతాయా? వివాహాల కోసం వేలది మంది ఎదురుచూపులు!

అప్పుడైనా పెళ్లిళ్లు జరుగుతాయా?  వివాహాల కోసం వేలది మంది ఎదురుచూపులు!
x
marriage (rep.image)
Highlights

పెళ్లంటే మరీ అని హడావిడి చెయ్యాలనుకుంటే ఇప్పుడు అస్సలు కుదరదు. ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ.. గడప దాటనివ్వకుండా కరోనా కంచె వేసింది. దీంతో మంచి ముహూర్తాలు మౌనంగా దాటిపోతున్నాయి.

పెళ్లంటే ఆకాశమంత పందిరి భూదేవి అంత చాపలు పరిచేసి కోట్లు ఖర్చు కుమ్మరించేవారు. విందు,చుట్టాలు , వందలాది కాదు వేలాది మందికి భోజనాలు,అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా సాగాలి పెళ్లంటే మరీ అని హడావిడి చెయ్యాలనుకుంటే ఇప్పుడు అస్సలు కుదరదు. ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ.. గడప దాటనివ్వకుండా కరోనా కంచె వేసింది. దీంతో మంచి ముహూర్తాలు మౌనంగా దాటిపోతున్నాయి.

లాక్‌డౌన్‌తో వేలాది పెళ్లిళ్లు వాయిదా. మూడు నెలలుగా నిలిచిపోయిన శుభకార్యాలు. పెళ్లిళ్ల కోసం ఆగస్టు వరకు ఎదురు చూపులు. మూతపడిన కల్యాణ మండపాలు, ఆలయాలు. వేలాది మంది జీవితాలపై కరోనా ప్రభావం.

మహమ్మారి దెబ్బకు ఈ ఏడాది పెళ్లిళ్ల ముచ్చట్లన్నీ బంద్‌ అయ్యాయి. కొడుకును ఒక ఇంటివాడిని చేయాలని కూతురును ఒక అయ్య చేతిలో పెట్టాలని అనుకున్న తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. ఈ నెల, వచ్చే నెలల్లో జరగాల్సిన వేలాది పెళ్లిళ్లు, ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు మాత్రం అటువైపు, ఇటువైపు కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో సాదాసీదాగా కళ్యాణాలు కానిచ్చేస్తున్నారు. వైభవంగా పెళ్లి జరుపుదామనుకున్న వారి ఆశలపై లాక్‌డౌన్‌ నిబంధనలు నీళ్లు చల్లేశాయి. దీంతో ముహూర్తాలను చాలామంది ఆగస్టుకు వాయిదా వేసుకున్నారు.

అషాడం, మౌఢ్యాల కారణంగా వివాహ ముహూర్తాలు ఇప్పట్లో లేవు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే శ్రావణం వరకు పెళ్లిళ్లు జరగడం కష్టమే. దీంతో చాలా మంది ఆగస్టుల్లో పెళ్లి వేడుకలు జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. మరికొందరు నవంబర్‌లో ముహూర్తాలు పెట్టుకున్నారు. జీవితంలో ఒకసారి నిర్వహించే వేడుక కాబట్టి అందరూ పెళ్లిని గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటారు.

పెళ్లంటే.. పందిళ్లు, సందళ్లు.. తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలే కాదు..కోట్లాది రూపాయాల వ్యాపారం కూడా . అలాంటి బిజినెస్‌ కరోనా దెబ్బలకు విలవిలలాడుతోంది. కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లు, ఆలయాలు మూతపడటంతో వేలాది వివాహాలు వాయిదా పడ్డాయి. దీంతో వివాహ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

పురోహితులు, డోలు సన్నాయి, మంటపాల నిర్వాహకులు, పుష్పాలంకరణ, వంట వారు, ఫొటో, వీడియోగ్రాఫర్లు, అద్దె వాహనదారులు ఇలా పెళ్లిళ్లపై ఆధారపడే పలువురి ఉపాధి పోయింది. కనీస ఆదాయం లేక దయనీయ స్థితిలో ఉన్నారు. పరిస్థితి ఎప్పుడు కుదుటపడుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories