బతికుండగానే యావదాస్తిని దానం చేసిన దాన కర్ణుడు

బతికుండగానే యావదాస్తిని దానం చేసిన దాన కర్ణుడు
x
Highlights

ఎవరన్నా అడిగితే జేబులో ఉంటె ఓ ఐదో పదో ఇస్తారు. లేకపోతె.. చిల్లర లేదని చెప్పేస్తారు. కొంతమంది తమ జీతంలో కొద్ది మొత్తం చారిటీకి ఇస్తారు. మరికొందరు ఎదో...

ఎవరన్నా అడిగితే జేబులో ఉంటె ఓ ఐదో పదో ఇస్తారు. లేకపోతె.. చిల్లర లేదని చెప్పేస్తారు. కొంతమంది తమ జీతంలో కొద్ది మొత్తం చారిటీకి ఇస్తారు. మరికొందరు ఎదో పుట్టినరోజో.. పెళ్లి రోజో అని చెప్పి ఓ పూట అనాధలకో..అన్నర్తులకో భోజనం పెట్టి అబ్బ చాలా చేశామనుకుని చెప్పుకుంటారు. కొంతమంది చెప్పుకోక పోవచ్చు కూడా. కానీ, తమకు ఉన్నదంతా ఇచ్చేసి.. సాధారణ జీవితం గడపగలిగే అపురూప వ్యక్తులు ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఉంటె పురాణాల్లో దాన కర్ణుడు అనో.. మరోటి అనో చెప్పుకునే వారు. ఇప్పుడు అయితే, అంతలేదు.. ఎవరైనా తనకున్నదంతా దానం చేసేసి మామూలుగా జీవిస్తాడాఅలా పిచ్చోడైతేనే చేస్తాడు అంటారు. కానీ.. ఆయన పిచ్చోడు కాదు.. అయన చేసింది పదో పరకో దానమూ కాదు.. అక్షరాలా 58 వేల కోట్లు! అవును తాను బ్రతకడానికి కావలసినది ఉంచుకుని జీవితాంతం తాను కష్టపడి సంపాదించిన సొమ్మంతా వివిధ కార్యకలాపాలకు రాసి ఇచ్చేశాడు.

ఆ వ్యక్తి పేరు ఛార్లెస్ 'చక్‌' ఫీనీ.. ఈయనగారి దానగుణానికి సంబంధించిన కథనాన్ని ప్రముఖ వెబ్ సైట్ అలయన్స్ ప్రచురించింది. ఆ వివరాలిలా ఉన్నాయి..

ఎనిమిదేళ్ల కిందట డ్యూటీ ఫ్రీ షాపర్స్ సహ-వ్యవస్థాపకుడు ఛార్లెస్ 'చక్‌' ఫీనీ (89) తన యావదాస్తినీ దానం చేస్తానని మాట ఇచ్చారు. పురాణాల్లో కర్ణుడు ఏవిధంగానైతే ఇచ్చిన మాటలను నిలబెట్టుకునే వాడో ఇప్పుడు ఆయన కూడా మాటను నిబెటుకున్నాడు. తాను ఇచ్చిన మాట ప్రకారమే యావదాస్తిని తృనప్రాయంగా వదులుకున్నాడు. ఒకటి కాదు రెండు ఏకంగా రూ.58వేల కోట్లకు అధిపతి అయిన చక్ పదవీ విరమణ అనంతరం తన భార్యతో కలిసి జీవించడానికి రూ.14కోట్లను తన దగ్గర పెట్టుకున్నాడు. మిగిలిన ఆస్తిని తన స్వచ్ఛంద సంస్థ 'అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌' ద్వారా దానం చేశారు. తాను కన్న కలలు సెప్టెంబరు నెలతో పూర్తికావడంతో ఫీనీ స్వచ్ఛంద సంస్థ ప్రయాణం ఈనెల 14న ముగిసింది.

ఆయన చేసిన మంచి పనిని గుర్తించిన మీడియా ఆయనతో మాట్లాడగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నేను నా జీవితంలో చాలా నేర్చుకున్నాను. ఇంత మంచి పని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కన్న కలలను నేను బతికుండగానే పని పూర్తి చేయడం నాకు చాలా సంతృప్తిని కలిగిస్తుంది. నేను చేసిన ఈ ప్రయాణంలో నాకు సహకరించి ప్రతి ఒక్కరికి కృత‌జ్ఞ‌త‌లు. తాము సంపాదించిన ఆస్తిని బతికుండగానే దానం చేస్తే ఎంత సంతృప్తి కలుగుతుందో ఒక్కాసారి మీరు ప్రయత్నించండి, అది మీకు నచ్చుతుంది అని ఛార్లెస్ ఫోర్బ్స్‌ పత్రికతో వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు రూ.58వేల కోట్లకు అధిపతి అయిన చాక్ ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ఓ సాధారణ అపార్ట్‌మెంట్‌‌లో ఓ మధ్యతరగతి మనిషిలా తన భార్యతో కలిసి విశ్రాంత జీవితాన్నిగడుపుతుండడం విశేషం. ఛార్లెస్ చక్ 1960లో రాబర్ట్ మిల్లర్‌తో కలిసి డ్యూటీ ఫ్రీ షాపర్స్‌ను ఏర్పాటుచేశారు. ఆయన సంపాదించిన ఆస్తిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి 76 మిలియన్లు, 700 మిలియన్ డాలర్ల ఆరోగ్య సంరక్షణకు, 3.7 బిలియన్లు విద్యకు, 870 మిలిన్లు మానవ హక్కులు, సామాజిక మార్పునకు, వియత్నాంలో ప్రజారోగ్య సంరక్షణకు 270 మిలియన్ డాలర్లను, అలాగే 350 మిలియన్ డాలర్లను న్యూయార్క్ నగరం రూజ్‌వెల్ట్ ద్వీపంలో టెక్నాలజీ క్యాంపస్‌ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు.

ఇక పోతే ఫీని చేసిన ఈ పని ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది. బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ తమ దాతృత్వాన్ని చాటుకోవడం వెనుక ఫీనియే స్ఫూర్తిదాత. ఈ క్రమంలోనే బిల్‌ గేట్స్‌ మాట్లాడుతూ 'మా అపార సంపదలను దానం చేయడానికి చక్‌ మాకు ఓ మంచి మార్గం చూపారన్నారు. సగం అస్తులు కాదు, యావదాస్తిని దానం చేయాలంటూ తను నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని కలిగించారు' అని పేర్కొన్నారు. చార్ల్స్ చక్‌ను ప్రతి ఒక్కరు దానంలో జేమ్స్‌బాండ్‌గా పిలుస్తారన్నారు. ఆయన తొలిసారిగా 1984లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి ఉత్తర ఐర్లాండ్‌లో శాంతి, అలాగే వియత్నాంలో ఆరోగ్య సంరక్షణకు కృషిచేశారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories