Viral News: ఆ రాశివారు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోకండి.. వైరల్‌ అవుతోన్న న్యూస్

మన పక్కన ఉన్న చైనా దేశంలో. సదరు కంపెనీ చేసిన ప్రకటనపై ప్రస్తుతం ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది.

China based company Bans Applicants Born Under Specific Zodiac Signs for clerk job
X

Viral News: ఆ రాశివారు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోకండి.. వైరల్‌ అవుతోన్న న్యూస్ 

Viral News: సాధారణంగా ఏదైనా ఉద్యోగ ప్రకటన విడుదల చేసే సమయంలో సదరు కంపెనీల అవసరాలకు అనుగుణంగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. వీటిలో అభ్యర్థుల నైపుణ్యాలు, వారి ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్, వర్క్‌ ఎక్స్‌పీరియన్స్‌ వంటివి పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగాలైతే రిజర్వేషన్‌ను చూస్తారు. అలా కాకుండా అభ్యర్థి రాశిని కన్సిడర్‌ చేస్తే ఎలా ఉంటుంది.?

పలానా రాశికి చెందిన వారికి అస్సలు ఉద్యోగం ఇవ్వమని నోటిఫికేషన్‌లో పేర్కొంటే.? వినడానికి వింతగా ఉంది కదూ! కానీ ఓ కంపెనీ మాత్రం నిజంగానే ఇలాంటి ప్రకటన చేసింది. అయితే ఇది మన దేశంలో కాదు లేండి. మన పక్కన ఉన్న చైనా దేశంలో. సదరు కంపెనీ చేసిన ప్రకటనపై ప్రస్తుతం ప్రపంచమంతా చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగం కోసం అతని క్వాలిఫికేషన్స్‌ చూడాలి కానీ రాశితో పనేంటని నెటిజన్లు అంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని సాంక్సింగ్‌ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో ఇటీవల క్లర్క్‌ ఉద్యోగాల కోసం పత్రికలో ప్రకటన విడుదల చేశారు. అయితే అభ్యర్థులకు ఉండాల్సిన క్వాలిఫికేషన్‌లో విషయంలో కంపెనీ ఓ కండిషన్‌ పెట్టింది. ‘ఇయర్‌ ఆఫ్‌ ద డాగ్‌’ రాశిలో జన్మించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదంటూ తేల్చి చెప్పింది. సదరు రాశికి చెందిన వారు అప్లికేషన్స్‌ను బ్యాన్‌ చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఈ విషయమై కంపెనీ ఉద్యోగి మాట్లాడుతూ.. ‘కంపెనీ బాస్‌ రాశి ‘డ్రాగన్‌’. దీనికి ‘ఇయర్‌ ఆఫ్‌ ద డాగ్‌’కు పొంతన కుదరదు. కంపెనీకి నష్టం వాటిల్లుతుందని భావించామని అందుకే ఆ రాశికి చెందిన వారు ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story