Viral Video: స్మార్ట్‌ ఫోన్‌ చూస్తూ రోడ్డు దాటుతోన్న యువతి.. అంతలోనే దూసుకొచ్చిన కారు.. షాకింగ్ వీడియో..!

Viral Video: ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ కచ్చితండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 Nov 2024 4:22 PM IST
Car Hits Young Women Who Walking on Road While Using Mobile Phone Video Goes Viral
X

Viral Video: స్మార్ట్‌ ఫోన్‌ చూస్తూ రోడ్డు దాటుతోన్న యువతి.. అంతలోనే దూసుకొచ్చిన కారు.. షాకింగ్ వీడియో..!

Viral Video: ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ కచ్చితండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్‌ ఉండాల్సిందే. అన్నం తినుకుంటూ కూడా ఫోన్‌ చూస్తున్నారు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ పిచ్చిలో పడిపోయి పక్కన ఏం జరుగుతుందో కూడా గుర్తించడం లేదు. స్మార్ట్‌ ఫోన్‌ మోజులో పడిపోయిన ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటున్నారు.

తాజాగా ఓ యువతి ఇలాగే ఫోన్‌ చూస్తూ రోడ్డు దాటుతోన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రోడ్లపై ఫోన్‌లు పట్టుకొని నడిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్పేందుకు ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. సింగపూర్‌కు చెందిన ఓ యువతి చేతిలో పోన్‌ చూస్తూ రోడ్డు దాటుతోంది. అయితే అదే సమయంలో వేగంగా ఓ కారు దూసుకొస్తోంది. ఆమె కారును గమనించకుండానే.. రోడ్డు మధ్యలో వరకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో కారు ఒక్కసారిగా ఆమెను బలంగా ఢీకొట్టింది.

దీంతో యువతి ఒక్కసారిగా బంతిలా గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడిపోయింది. అయితే అదే సమయంలో కారులో ఉన్న వ్యక్తులు తమ ఫోన్‌లో వీడియోను రికార్డ్‌ చేస్తున్నారు. దీంతో ఇదంతా స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. యువతి కింద పడగానే కారులో ఉన్న వ్యక్తులు కిందికి దిగి యువతిని కాపాడే ప్రయత్నం చేశారు.

అయితే కారు యువతిని బలంగా ఢీకొట్టినా యువతి చిన్న చిన్న గాయాలతోనే బయటపడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరీ ఇంత ఫోన్ పిచ్చి ఏంటని కొందరు కామెంట్స్‌ చేస్తుండగా. మరికొందరు ప్రాణాల కంటే ఫోన్‌ ఎక్కువైందా అంటూ చురకలు అంటిస్తున్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story