optical illusion: చూడ్డానికి అన్నీ 'B'లే ఉన్నాయి కదూ.. ఇందులోనే '8' నెంబర్‌ కనిపెట్టండి చూద్దాం

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే అన్ని 'B' లెటర్స్‌ కనిపిస్తున్నాయి కదూ! అయితే ఈ 'B' ల మధ్యే '8' నెంబర్‌ కూడా దాగి ఉంది.

Shashank Gullapelli
Updated on: 17 Aug 2024 10:15 PM IST
Can you find there is 8 number among the B letters in this optical illusion photo
X

optical illusion: చూడ్డానికి అన్నీ 'B'లే ఉన్నాయి కదూ.. ఇందులోనే '8' నెంబర్‌ కనిపెట్టండి చూద్దాం

optical illusion: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఆప్టికల్ ఇల్యూజన్‌ సంబంధిత ఫొటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. చూసే కళ్లను మాయ చేసేలా ఉండే ఇలాంటి ఫొటోలు కన్ఫ్యూజ్‌ చేస్తుంటాయి. అయితే ఇలాంటి వాటిని సాల్వ్‌ చేయడంలో ఉండే కిక్కు వేరే ఉంటుంది. అందుకే సోషల్‌ మీడియాలో ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోలకు బాగా క్రేజ్‌ ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న మ్యాజిక్‌ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే అన్ని 'B' లెటర్స్‌ కనిపిస్తున్నాయి కదూ! అయితే ఈ 'B' ల మధ్యే '8' నెంబర్‌ కూడా దాగి ఉంది. దానిని కనిపెట్టడమే ఈ టాస్క్‌ ముఖ్య ఉద్దేశం. అయితే కేవలం 10 సెకండ్స్‌లో ఈ నెంబర్‌ను కనిపెట్టడమే ఈ ఆప్టికల్‌ ఇల్యూజన్ ఫొటో ముఖ్య ఉద్దేశం. అయితే ఈ టాస్క్‌ను సాల్వ్‌ చేయడం అంత సులభమైన విషయం కాదు. దీనికి కారణం 'B' లెటర్‌.. '8' నెంబర్‌ను పోలి ఉండడమే దీనికి కారణం. మరి ఓసారి ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్‌ చేసే ప్రయత్నం చేయండి.

ఈ ఫొటోను కాస్త తీక్షణంగా గమనిస్తే చాలు నెంబర్‌ ఇట్టే కనిపెట్టవచ్చు. ఎంత ట్రై చేసినా పజిల్‌ను సాల్వ్‌ చేయలేకపోతున్నారా.? అయితే ఒకసారి పై నుంచి 6వ లైన్‌ను జాగ్రత్తగా గమనించండి. అందులోనే మీరు వెతుకుతోన్న 8 నెంబర్‌ దాగి ఉంది. ఇంత క్లూ ఇచ్చిన తర్వాత కూడా పజిల్‌ను సాల్వ్‌ చేయలేకపోతున్నారా.? అయితే సమాధానం కోసం కింద ఉన్న ఫొటో చూసేయండి.



Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story