Optical Illusion: మీ ఐ పవర్‌ సూపర్‌ అనే ఫీలింగ్‌లో ఉన్నారా.? ఇందులో 580ని కనిపెట్టండి చూద్దాం..!

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు చూసే కళ్లను మాయ చేస్తాయి. కంటి చూపును పరీక్షిస్తాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Aug 2024 1:51 PM IST
Can you Find There is 580 Number Among the 590 Numbers in This Optical Illusion Photo
X

Optical Illusion: మీ ఐ పవర్‌ సూపర్‌ అనే ఫీలింగ్‌లో ఉన్నారా.? ఇందులో 580ని కనిపెట్టండి చూద్దాం..!

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలు చూసే కళ్లను మాయ చేస్తాయి. కంటి చూపును పరీక్షిస్తాయి. అంతేనా.. మన ఆలోచన విధానాన్ని సైతం అంచనా వేస్తుంటాయి. ఒకప్పుడు ఇలాంటి ఫొటో పజిల్స్‌ సండే మ్యాగజైన్స్‌లో కనిపించేవి. అయితే ఎప్పుడైతే సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి.. నెట్టింట ఇలాంటి ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో నెంబర్స్‌కి సంబంధించినవి కూడా ప్రధానమైనవి అని చెప్పాలి. నెంబర్స్‌ ఆప్టికల్‌ ఇల్యూజన్ ఫొటోలు మన ఐ పవర్‌కు పరీక్ష పెడుతాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. పైన కనిపిస్తున్న ఫొటో చూసిన వెంటనే మనకు సహజంగా కనిపిస్తున్న నెంబర్‌ 590. అంతేకదూ! అయితే ఈ నెంబర్స్‌ మధ్యలో మరో నెంబర్‌ కూడా దాగి ఉంది. అదేంటో గుర్తించడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటో ముఖ్య ఉద్దేశం.

ఈ ఫొటోలో అన్ని 590 నెంబర్లు ఉన్నాయి అయితే ఇందులోనే 580 నెంబర్‌ దాగి ఉంది. దానిని కనిపెట్టారా.? అయితే ఈ పజిల్‌ను కేవలం 10 సెకండ్స్‌లో కనిపెట్టాలి. మరి ఈ పజిల్‌ను సాల్వ్‌ చేశారా.? లేదంటే ఓసారి తీక్షణంగా గమనిస్తే ఇట్టే సమాధానం పట్టేయొచ్చు. ఎంత ప్రయత్నించినా 580 నెంబర్‌ను గుర్తించలేక పోతున్నారా.? అయితే ఓసారి చివరి నుంచి రెండో లైన్‌ను జాగ్రత్తగా గమనించండి. అందులోనే మీరు వెతుకుతోన్న 580 కనిపిస్తుంది.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story