Blue Egg: అరుదైన కోడి గుడ్డు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా!

Blue Egg: అరుదైన కోడి గుడ్డు.. దీని ప్రత్యేకత ఏమిటో తెలుసా!
x
Highlights

Blue Egg: సాధారణంగా మనం చూసే కోడిగుడ్లు తెల్లటి లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయి.

Blue Egg: సాధారణంగా మనం చూసే కోడిగుడ్లు తెల్లటి లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఓ కోడి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేలా నీలం రంగులో గుడ్డు పెట్టింది. ఈ వింత ఘటన స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

దేవనగరి జిల్లాలోని నల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ నూర్ అనే వ్యక్తి కోళ్ల పెంపకం చేస్తుంటారు. ఆయన వద్ద ఉన్న 10 నాటుకోళ్లలో ఒకటి ఇటీవల అనుకోకుండా నీలం రంగులో గుడ్డును పెట్టింది. సాధారణ గుడ్లకు భిన్నంగా ఉండటంతో మొదట సయ్యద్‌ షాక్‌ అయ్యారు. తర్వాత దాన్ని జాగ్రత్తగా భద్రపరిచారు. ఈ విషయమై చుట్టుపక్కల గ్రామస్తులకి తెలిసి, గుడ్డు చూడటానికి చాలామంది సయ్యద్ ఇంటికి పోటెత్తుతున్నారు.

అధికారుల విచారణలో ఏం తెలిసింది?

ఈ సమాచారం జంతు సంరక్షణ అధికారుల దృష్టికి వెళ్లిన తర్వాత, వారు వచ్చి కోడిని పరిశీలించారు. కొన్ని కోళ్లు అప్పుడప్పుడు లేత ఆకుపచ్చ రంగులో గుడ్లను పెట్టడం సాధారణమేనని, కానీ నీలం రంగు గుడ్డు చాలా అరుదైనదని వారు తెలిపారు.

వారు ఇచ్చిన వివరాల ప్రకారం, కోడి క్లోమంలో ఉండే బిలివర్డిన్‌ (Biliverdin) అనే రసాయనం కారణంగా గుడ్డు నీలం రంగులో ఉండే అవకాశం ఉంది. ఇది జన్యుపరమైన లక్షణాల వల్ల ఏర్పడుతుందని, ఇటువంటి గుడ్ల పోషక విలువలు సాధారణ గుడ్లతో సమానంగా ఉంటాయని స్పష్టం చేశారు.

ఇలాంటి గుడ్లు ప్రపంచంలో ఎక్కడ కనిపిస్తాయి?

ఈ ఘటన పూర్తిగా అపూర్వమైనదేమీ కాదట. లాటిన్ అమెరికా దేశాల్లో కనిపించే కొన్ని ప్రత్యేక జాతుల కోళ్లు – ముఖ్యంగా ఆరౌకానా (Araucana), అమెరౌకానా (Ameraucana) – నీలం, ఆకుపచ్చ రంగుల్లో గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. వాటిలో బిలివర్డిన్ స్థాయులు ఎక్కువగా ఉండడం వల్లే గుడ్లకు రంగు వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories