తండ్రి గొరిల్లాను మొదటిసారి కలుసుకున్న పిల్ల గొరిల్లా... హార్ట్ టచ్చింగ్ వీడియోకి నెటిజన్స్ ఫిదా

Gorilla: అమ్మ ప్రాణం పోసి జన్మనిస్తే.. ఎలా జీవించాలో నేర్పేవాడు తండ్రి..

Dhatripriya
Updated on: 11 May 2023 11:00 AM IST
Baby Gorilla Meets Father Gorilla For The First Time Video Gone Viral
X

తండ్రి గొరిల్లాను మొదటిసారి కలుసుకున్న పిల్ల గొరిల్లా... హార్ట్ టచ్చింగ్ వీడియోకి నెటిజన్స్ ఫిదా

Father Love: అమ్మ ప్రాణం పోసి జన్మనిస్తే.. ఎలా జీవించాలో నేర్పేవాడు తండ్రి.. వీరే మనకు ఆది గురువులు.. మనుషులకే కాదు మూగజీవులకు కూడా.. మనం ఏ విధంగా అయితే మన పిల్లలపై ప్రేమను కనబరుస్తామో అడవి జంతువులు సైతం వాటి పిల్లల పట్ల అంతే ప్రేమతో ఉంటాయి. అలాంటి వీడియోలను చూస్తే మనకు ఒక తెలియని అనుభూతి కలుగుతుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఓ బేబీ గొరిల్లా మొదటిసారి తన తండ్రిని చూసింది. ఎంతో ఆశ్చర్యంగా ఆ పిల్ల గొరిల్లా తన తండ్రి ముఖాన్ని తన చిట్టి చేతులతో తాకి అనుభూతిని పొందింది. తండ్రి గొరిల్లా సైతం పిల్ల గొరిల్లా ఉత్సుకతను గమనించి.. కొద్దిగా వంగి పిల్లకు మరింత అనువుగా, తన ముఖాన్ని అందించింది. తండ్రి సైతం ఆ చిట్టి చేతులు తన ముఖాన్ని తాకడంతో మనోహరమైన అనుభూతికి గురైంది. తండ్రి గొరిల్లా, బేబీ గొరిల్లా మధ్య జరుగుతున్న ఈ పరిచయాన్ని తల్లి గొరిల్లా అక్కడే ఉండి నిశితంగా గమనిస్తూ ఉంది.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్లిప్ ను వీక్షించిన ప్రతిఒక్కరూ ఎంతో చూడముచ్చటగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. హార్ట్, లవ్ ఎమోజీలతో నింపేశారు. మొత్తానికి, ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ తెలియని ఒక ఆనందాన్ని అనుభవించారు. దీన్నే ప్రేమ అంటారేమో.



Dhatripriya

Dhatripriya

Next Story