School Holidays: ఏప్రిల్‌నెల ఎగిరిగంతేసే వార్త.. స్కూళ్లకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

April Month School Holidays 2025
x

School Holidays: ఏప్రిల్‌నెల ఎగిరిగంతేసే వార్త.. స్కూళ్లకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

Highlights

April Month School Holidays 2025: విద్యార్థులకు మరో బంపర్ గుడ్ న్యూస్. ఏప్రిల్ నెల స్కూల్ హాలిడేస్ జాబితా వచ్చేసింది. విద్యార్థులకు హాలిడేస్ అంటే పండగ లాంటి వార్త. వచ్చే నెల ఎన్నిరోజులు స్కూళ్లకు సెలవు తెలుసా?

April Month School Holidays 2025: మొన్నటి వరకు పరీక్షలతో విసుగెత్తిపోయిన విద్యార్థులకు పండుగ చేసుకునే వార్త. ఏప్రిల్ నెలకు సంబంధించిన హాలిడేస్ జాబితా వచ్చేసింది. ఎండాకాలం సెలవులు స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో మరిన్ని సెలవులు కూడా రానున్నాయి. ఇది పండుగలు, ప్రత్యేక దినాల సందర్భంగా ఈ సెలవులు రానున్నాయి. ఏప్రిల్ నెలలో స్కూళ్లకు ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసుకుందాం

ఏప్రిల్ నెలలో స్కూల్లో సెలవులు..

మార్చి 31వ తేదీ రంజాన్ పండుగ ఉంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ కూడా పండుగ సెలవులు ఉంటాయి. అంటే రంజాన్‌కు రెండు రోజులు సెలవులు ఇస్తున్నారు.

ఏప్రిల్ 6 ఆదివారం ఈరోజు శ్రీరామనవమి కూడా జరుపుకుంటారు. కొన్ని ఆలయాల్లో రాముల వారి పెళ్లి వైభవంగా జరుపుతారు. ఆరోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

ఏప్రిల్ 10 మహావీర్ జయంతి.. ఇది గురువారం రోజు రానుంది. ఈరోజు కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

ఏప్రిల్ 13.. ఆదివారం ఈరోజు 'బైశాఖి' నిర్వహిస్తారు. అయితే ఆదివారం కాబట్టి అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 14 డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ జయంతి. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుంది.

ఏప్రిల్ 18 శుక్రవారం 'గుడ్ ఫ్రైడే' ఇది ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈరోజు కూడా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉంటాయి. ఈరోజు బ్యాంకులకు కూడా సెలవు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గుడ్‌ ఫ్రైడే సెలవు ఉంటుంది.

నెలలో అనేక రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రానున్నాయి. అయితే కొన్ని ప్రత్యేక రోజులు, పండుగలు రోజుల్లో మాత్రం ఆయా స్థానికతను బట్టి సెలవులను మంజూరు చేస్తారు. ఇది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా అమలు చేస్తారు. స్కూలు యాజమాన్యం నుంచి ముందుగానే దానికి సంబంధించిన అప్డేట్ వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories