Viral Video: 'బోరింగ్‌ అని అంటూ ఏది ఉండదు'.. ఆకట్టుకుంటోన్న వైరల్‌ వీడియో

Viral Video: 'బోరింగ్‌ అని అంటూ ఏది ఉండదు'.. ఆకట్టుకుంటోన్న వైరల్‌ వీడియో

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 29 July 2024 8:45 PM IST
Anand mahindra shares viral video of a traffic police who dance on roads
X

Viral Video: 'బోరింగ్‌ అని అంటూ ఏది ఉండదు'.. ఆకట్టుకుంటోన్న వైరల్‌ వీడియో 

Viral Video: ఆనంద్‌ మహీంద్ర.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మహీంద్రా అండ్‌ మహీంద్రా అధినేతగా కంటే సోషల్‌ మీడియాలో ఇంట్రెస్టింగ్ వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఎక్కువ మందికి సుపరిచితులు మహీంద్ర. నిత్యం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్‌ చేస్తుంటారు. ఎక్కడ ఏ వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా ఆనంద్‌ మహీంద్ర వెంటనే ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తుంటారు.

అంతేనా ఆ వీడియోకు అందమైన క్యాప్షన్‌ను జోడిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. ట్రాఫిక్‌ జామ్‌లో డ్యాన్స్‌ చేస్తున్న ఓ పోలీస్‌ ఆఫీసర్‌కు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. ట్రాఫిక్‌ కానిస్టేబుల్ రంజిత్‌ సింగ్ గురించి చాలా మందికి పరిచయమే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గ‌త 16 ఏండ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. అయితే తాను చేసే పనిని వెరైటీగా చేస్తుంటాడు. ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేసే క్రమంలో రంజిత్‌ సింగ్‌ తన డ్యాన్స్‌తో అదరగొడుతారు.

ట్రాఫిక్‌లో ఆగిన జనాలకు తన డ్యాన్స్‌తో ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు రంజింత్‌ సింగ్‌. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్‌ చేశారు. ఈ వీడియోతో పాటు మండే మోటివేషన్‌ అనే క్యాప్షన్‌ను రాసుకొచ్చారు. అలాగే ఈవీడియోతో పాటు.. ఈ పోలీస్ బోరింగ్ ప‌ని అంటూ ఏమి ఉండదు అని నిరుపించాడు. మ‌న పనిని మ‌నం ఎలా చేయాలి అనేది నీ ఛాయిస్ అంటూ రాసుకొచ్చాడు. కాగా ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story