అమితాబ్ ని షాక్ కి గురిచేసిన కంటెస్టెంట్ సమాధానం...

అమితాబ్ ని షాక్ కి గురిచేసిన కంటెస్టెంట్ సమాధానం...
x
Highlights

కౌన్ బనేగా కరోడ్‌పతికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అంతో ఇంతో...

కౌన్ బనేగా కరోడ్‌పతికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అంతో ఇంతో అమౌంట్ ని గెలిచుకొని వెళ్ళడం అనేది కామన్.. ఆ గెలిచినా అమౌంట్ తో ఎం చేయాలనీ అనుకుంటున్నారు అని బిగ్ బీ అడగడం కూడా కామనే.. అయితే గురువారం ప్రసారమైన ప్రోగ్రామ్‌లో ఓ కంటెస్టెంట్ ని ఇదే ప్రశ్న అడిగాడు బిగ్ బీ... కానీ అతడు చెప్పిన సమాధనం విన్నాక బిగ్ బీ మాత్రమే కాదు అక్కడ ఉన్నవాళ్ళు అందరు షాక్ అయ్యారు.

బీహార్‌కు చెందిన కుమార్ రంజన్ అనే వ్యక్తి ఈ షోలో పాల్గొన్నాడు. అతడు గెలుచుకున్న అమౌంట్ తో తన భార్యకు మంగళసూత్రం కొని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పుకొచ్చాడు రంజన్ .రంజన్ ఓ అమ్మాయిని కొన్ని రోజుల క్రీతం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోవడంతో అందరికి దూరంగా ఉంటున్నాడు. అతను సంపాదించే డబ్బుతో తన భార్యకు మంగళసూత్రం కొనివ్వడం కష్టమని తెలిసి ఈ షోలో పాల్గొన్నట్టు చెప్పుకొచ్చాడు. అతను చెప్పిన సమాధానం విన్నాక అమితాబ్ తో పాటు అక్కడ ఉన్నవారు అందరు షాక్ అయ్యారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories