Viral Video: పంజాబీ పాటకి స్టెప్స్‌ వేసిన ఎయిర్ హోస్టెస్.. సోషల్ మీడియాలో వైరల్‌

Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోలను నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తారు.

hmtv Digital Team
Updated on: 13 Nov 2021 6:15 PM IST
Air Hostesses Dance on Punjabi Song Video Goes Viral on Social Media | Viral News
X

Viral Video: పంజాబీ పాటకి స్టెప్స్‌ వేసిన ఎయిర్ హోస్టెస్.. సోషల్ మీడియాలో వైరల్‌

Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఈ వీడియోలను నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు షేర్స్‌, కామెంట్స్‌, లైక్స్‌తో హుషారెత్తిస్తారు. ఈ వీడియోలలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆసక్తిగా ఉంటాయి. తాజాగా ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌ల డ్యాన్స్ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. యువతని పిచ్చెక్కిస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లతో అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియోలో ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లు రెడ్‌ డ్రెస్‌లో ఉండటం మనం గమనించవచ్చు. తర్వాత వీరు ఫేమస్‌ పంజాబీ పాటకి చాలా అందంగా డ్యాన్స్‌ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఎయిర్ హోస్టెస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరు స్పైస్ జెట్‌కి సంబంధించిన ఎయిర్ హోస్టెస్ అని తెలుస్తోంది. ఈ ఇద్దరు అమ్మాయిల ఈ డ్యాన్స్ వీడియోని ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. డ్యాన్స్‌లో ఇరగదీశారంటూ సోషల్ మీడియా యూజర్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

ఈ వీడియోని ఇప్పటికే యాబైవేలకు పైగా యూజర్లు తిలకించారు. వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. చాలామంది కామెంట్ చేశారు. ఒక వినియోగదారు వ్యాఖ్యానిస్తూ 'వావ్ వీరి డ్యాన్స్ చాలా బాగుంది' అని రాశారు. రెండో వినియోగదారు, 'సూపర్‌ డ్యాన్స్‌' అని ప్రశంసించాడు. మరొక వినియోగదారు 'ప్రతి ఒక్కరికి తన జీవితాన్ని ఆస్వాదించే హక్కు ఉందని' అన్నాడు. చాలా మంది డ్యాన్స్‌ని చూసి అభినందనలతో ముంచెత్తుతున్నారు. మీరు కూడా ఈ డ్యాన్స్‌ని చూసి మీ స్పందనను తెలియజేయండి.



hmtv Digital Team

hmtv Digital Team

Next Story