Viral Video: వామ్మో పాముకు సీపీఆర్‌.. షాకింగ్ వీడియో..!

Viral Video: పాములు కనిపించగానే ఎవరైనా ఏం చేస్తారు.. ఏముంది వెంటనే వెనక్కి చూడకుండా పరుగులు పెడుతుంటాం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 Oct 2024 9:55 AM IST
A Young Man Saves Snake Life by Doing CPR Video Goes Viral
X

Viral Video: వామ్మో పాముకు సీపీఆర్‌.. షాకింగ్ వీడియో..!

Viral Video: పాములు కనిపించగానే ఎవరైనా ఏం చేస్తారు.. ఏముంది వెంటనే వెనక్కి చూడకుండా పరుగులు పెడుతుంటాం. ఎవరైనా చేసేది ఇదే కదా! అలాంటి పామును చేతిలోకి తీసుకొని మనిషికి చేసినట్లు సీపీఆర్‌ చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడానికే వింతగా ఉంది కదూ! కానీ ఇది నిజంగా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

సీపీఆర్‌ ప్రాసెస్‌ గురించి మనందరికీ తెలిసిందే. మనిషి చనిపోయే సమయంలో కృత్రిమంగా నోటి ద్వారా శ్వాసను అందించి మనిషి బతికించే ప్రక్రియను సీపీఆర్‌గా చెబుతుంటారు. అయితే ఈ సీపీఆర్‌ను పాముకు చేస్తే ఎలా ఉంటుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ లోని వడోదరలో ఓ పాము అపస్మారక స్థితిలో ఉంది.

ఈ విషయాన్ని అక్కడే ఉన్న ఓ యవకుడు గమనించాడు. అందరిలా ఆ పామును చూసి పారిపోలేదు. వెంటనే పాము దగ్గరికీ వెళ్లి పామును చేతిలోకి తీసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న పాము నోటిలోకి గాలిని ఊదారు. అచ్చంగా ఒక మనిషికి సీపీఆర్‌ చేసినట్లు చేశాడు. దీంతో కాసేపటికే పాములో కదలికలు కనిపించాయి. దీంతో పామును కింద పెట్టడంతో నెమ్మదిగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది.

ఇదంతా అక్కడే ఉన్న వారు ఫోన్‌లో దృశ్యాలను రికార్డ్‌ చేశారు. దీంతో ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. చనిపోయే స్థితిలో ఉన్న పామును బతికించిన ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియోకు పెద్ద ఎత్తున లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story