Viral Video: రూపాయి ఖర్చు లేకుండా రూమ్‌ హీటర్‌.. యువకుడి ఐడియాకు ఫిదా అవ్వాల్సిందే..!

Viral Video: చలికాలం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం అయ్యిందటే చాలు చలి మొదలవుతుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Nov 2024 2:03 PM IST
A Young Man Make Heater With Low Price Video Goes Viral in Social Media
X

Viral Video: రూపాయి ఖర్చు లేకుండా రూమ్‌ హీటర్‌.. యువకుడి ఐడియాకు ఫిదా అవ్వాల్సిందే..!

Viral Video: చలికాలం ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే చలి తీవ్రత పెరుగుతోంది. సాయంత్రం అయ్యిందటే చాలు చలి మొదలవుతుంది. అయితే చలి తీవ్రత నుంచి బటయపడేందుకు ఒక్కొక్కరు ఒకక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు. సాధారణంగా స్వెటర్లు, మఫ్లర్లను ఉపయోగిస్తుంటారు. అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో హీటర్లను ఉపయోగిస్తుంటారు. అయితే ఇలాంటి హీటర్లను కొనుగోలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న అంశమని తెలిసిందే.

అయితే ఆలోచన శక్తి ఉండాలే కానీ రూపాయి ఖర్చు లేకుండా కూడా హీటర్‌ను తయారు చేసుకోవచ్చని నిరూపించాడు ఓ యువకుడు. ప్రస్తుతం ఈ హీటర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అసలు ఖర్చు అనేదే లేకుండా ఆ యవకుడు ఈ హీటర్‌ను రూపొందించాడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడనేగా సందేహం. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఇందుకోసం యువకుడు ఓ ఇటుకను తీసుకున్నాడు. అనంతరం పై భాగంలో డ్రిల్లింగ్ మెషీన్‌తో కట్ చేశాడు. అక్కడ కాయిల్ సెట్ చేశాడు. అలాగే వైర్, ప్లగ్ కూడా ఆ ఇటకకు బోల్ట్‌ల సహాయంతో అమర్చాడు. అనంతరం ఆ ప్లగ్‌ను బోర్డ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. కొద్ది సేపటికే ఆ కాయిల్‌ ఎర్రగా మారింది. ఆ తర్వాత కాసేపటికే వేడిగా మారింది. ఇలా తక్కువ ధరలోనే హీటర్‌ను రూపొందించాడు.

దీనంతటినీ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కోట్ల మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భలే ఐడియా గురూ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story